Breaking
Tue. Nov 18th, 2025

చితిమంటల వేడిలో చలికాచుకుంటూ..!

moon lite society my poetry
moon lite society my poetry

నిశిరాతిరిలో, శూన్యాకాశంలో,
చంద్రలోకపు లోగిలిలో
దేనికోసమో నిరీక్షణ.
చితిమంటల వేడిలో చలికాచుకుంటూ
కీచురాళ్ల వాయిద్యం.
గుప్పెడంత గుండేలో ఇమడని సాగరఘోష
స్వార్థాగ్ని పర్వతంలో పెల్లుబికిన లావా
బంధాలను శిలావరణమై కప్పెస్తుంటే.
జీవన్మరణాల మధ్య రెపెపలాడుతున్న ఆ యవనిక
పేగు బంధం పెనుఉప్పెనై ముంచేసింది
ఊపిరాడని వృద్దకపోతం గిలగిలలాడుతోంది.
ప్రేమ చమురు ఇంకిపోయింది
మరణ మజిలీ చేరకమునుపే
పాడే మీది పడేశారు.
యోనిజులు విస్మరించినా అవనిజలు ఆదరించే.

(వృద్దురాలిని ప్రాణాలతో శ్మశానంలో వదిలిపెట్టి వెళ్ళిన సంఘటనతో నా మదిని తొలచిన వేవేల అక్షరాలలో కొన్ని).

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

లెక్కలకు పోరగాడి లేఖ

ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!

మేకల డాన్స్.. సోషల్ మీడియా షేక్ !

జోరుగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోరు

శ్రమ దేవోభవ

Related Post