Breaking
Tue. Nov 18th, 2025

మండలిలో పట్టభద్రుల గొంతుకనైత

graduate mlc elections in telangana- professor k.nageshwar
graduate mlc elections in telangana- professor k.nageshwar
ఎమ్మెల్సీ స్వ‌తంత్ర అభ్య‌ర్థి ప్రొఫెస‌ర్ కె.నాగేశ్వ‌ర్‌

ద‌ర్వాజ‌-రంగారెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం తుది అంకానికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నిల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు ప్రచారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేశారు. దీనిలో భాగంగానే “త‌న‌ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండ‌లిలో ప‌ట్ట‌భ‌ద్రుల గొంతుక‌ను అవుతా” న‌ని హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బుబ్ న‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి ప్రొఫెస‌ర్ కె.నాగేశ్వ‌ర్ అన్నారు. తాజాగా ఆయ‌న ఇబ్ర‌హింప‌ట్నం ప‌రిధిలోని వినోద క‌న్వెన్ష‌న్ హాల్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ కె.నాగేశ్వ‌ర్ మాట్లాడుతూ.. త‌న‌ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండ‌లిలో ప‌ట్ట‌భ‌ద్రుల గొంతుక వినిపిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పీఆర్సీ, ప్రమోషన్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యే ల జీతం 200 శాతం పెరిగితే ఉద్యోగుల జీతం 7.5 శాతమే పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో UTF నాయకులు దామోదర్, కిరణ్, శ్రీకాంత్, అరుణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మోసపోవద్దు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

ఇదిలా ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌, జయసారథిరెడ్డిలను గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఒక ప్రకటనలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార నేతలు చేసే హామీల మాదిరి పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు చేసే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఆయన ఓటర్లకు సూచించారు.

మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

ఎమ్మెల్సీ ఓటు వేయడం ఎరుకేనా ?

లీడ‌ర్ అన్నో.. ఓట‌ర్ల‌కు గీ ముచ్చ‌ట జ‌ర చెప్పుర్రి!

ఆకలి యాత్ర

శివ‌రాత్రి రోజు ఉప‌వాసం ఎందుకు ?

శివ నామ స్మరణలో ఆలయాలు

Related Post