Loading Now

ఏంటో ఈ మగ పుట్టుక !

man-work-think-1205084 ఏంటో ఈ మగ పుట్టుక !

ఏంటో ఈ మగ పుట్టుక !

ఆలోచనలు ఎక్కువ కానీ ఆచరణ తక్కువ..
రెండు టైర్ల బండి కొనలేడు కానీ
నాలుగు టైర్ల బండి కోసం ఆరాటపడుతడు…
ఇంట్లో ఉప్పులు పప్పులు ఉండవు కానీ
దోస్తాన్ లకు వందలు కర్సు పెడతడు….
ఇంట్లో అమ్మను బాగా చూసుకోలేడు కానీ
వచ్చే ఆలిని మంచిగ చూసుకోవాలని ఆలోచన చేస్తడు..
మంది కోసం నచ్చని పని చేస్తాడు
కానీ తన వాళ్ల కోసం ఏ పనీ చెయ్యడు….
ఎందుకు ఈ మగ పుటుక పుట్టిన అని బాధ పడుతడే కానీ
పుట్టి నందుకు ఏదైనా చెయ్యాలి అని అనుకోడు
ఏంటో ఈ మగ పుట్టుక……? ఏంటో ఈ మగ పుట్టుక‌ !

Share this content:

You May Have Missed