Breaking
Sat. Jun 28th, 2025

చివ‌రి ఘ‌డియ‌లు

“టైం ముంచుకొస్తోంది.. ఇంకా కొన్ని గంట‌ల్లో మ‌ళ్లీ అంతా మాములు అయిపోతుంది. మొన్నటి వ‌ర‌కు అన్న‌తో రాసుకుని, పూసుకుని తిరిగిన స‌మ‌యం మ‌ళ్లెప్పుడో..? అయితే 15 రోజులు ముందు జ‌రిగిన ఘ‌ట‌న నాకు ఇప్ప‌టికీ గుర్తుకొస్తునే ఉంది. అవి ఎంత గ‌మ్మ‌త్తుగా ఉన్నాయో మాట‌ల్లో చెప్ప‌లేను. ఓట్ల ప్రచారంలో మేము వాడ వాడ తిరుగుతున్న‌ప్పుడు ఒక ద‌గ్గ‌ర‌ ఒక ఆవిడ వాళ్ల బుడ్డోడికి స్నానం చేపిస్తుంటే.. దాన్ని చూసిన‌ అన్న‌కు ఒక ఆలోచ‌న వ‌చ్చింది. వెంట‌నే ఆ బుడ్డోడికి స్నానం చేసిస్తానంటే.. నేను అన్న‌కు చెంబుతో నీళ్లు అందించిన‌.. అలాగే నేను ఎంగిలి చేసిన స్వీట్ కూడా అన్న గుంజుకుని తినేశాడు.. ఇలా ఎన్నో నా మ‌తి పోగొట్టే ఘ‌ట‌న‌లు ఈ నెల నుంచి చూస్తున్నా.. ఈ విష‌యాలు నా జీవితాంతం గుర్తుంటాయి. అన్న కోసం మా ఇంట్లొళ్ల‌తో గొడ‌వ‌కు కూడా దిగిన‌.. కానీ ఒక్క‌టి మాత్రం నిజం.. అన్న చూపించిన ప్రేమ. ఆప్యాయ‌త ఇప్ప‌టివర‌‌కు మా అమ్మ, అయ్య కూడా చూపించ‌లే..”

ఈ పైన చ‌దివిన మాట‌ల‌ను వింటే గ‌మ్మ‌త్తుగా అనిపిస్తుంది కదా! మీకు గ‌మ్మ‌త్తుగానే అనిపించొచ్చు కానీ.. ఎంతో మంది కార్య‌క‌ర్త‌లు, యువ‌కులకు అచ్చు గుద్దిన‌ట్లు అతికే విష‌యాలు ఇవి. రాజ‌కీయ నాయ‌కుల ఎత్తుగ‌డ‌ల‌కు బ‌లి అయ్యే బ‌తుకుల గాథ‌‌లు ఇవి. అన్న కోసం.. అన్న గెలుపుకోసం.. అన్న రాజ‌కీయ లబ్ధికోసం.. అన్న పెళ్లం పిల్ల‌ల బాగు కోసం.. త‌న‌, మ‌న అనే వాళ్ల‌తో కొట్లాట‌లు పెట్టుకునే అమాయ‌క జ‌నాల ముచ్చ‌ట‌ ఇది.

Final-clocks2 చివ‌రి ఘ‌డియ‌లు

అన్న జెండా ఎత్త‌మంటే చాలా.. ఒంట్లో స‌త్తువ లేకున్నా.. ఇంట్లో గాసం లేకున్నా.. పిల్ల‌గాళ్ల‌ ఆక‌లి కేక‌లు వినిపిస్తున్నా.. ఏమీ ప‌ట్టించుకోకుండా ముఖంపై చిరు న‌వ్వుతో ‌”మీ ఓటు మా అన్నకే వేయాలి” అని కోరే.. కార్య‌క‌ర్త‌ల విష‌యాలు చెబుతున్నా.. గింత తిప్ప‌లు ప‌డేది.. ల‌క్ష రూపాయ‌ల‌ను అన్న ఇస్తాడ‌నో.. క‌ష్ట‌ల్లో ఆదుకుంటాడ‌నో కాదు.. అన్నతో ఒక ఫొటో దిగ‌నికే.. అన్న‌తో ఒక టీ తాగాల‌ని.. అన్న‌తో క‌లిసి కారులో తిర‌గాల‌ని ఆర‌ట ప‌డు వ్య‌క్తుల విష‌యాలు ఇవి.

ఫైస‌లు కావాలంటే ప‌నులు చేస్తుంటుమి. కానీ.. ఎండ‌న‌క‌, వాన‌న‌క‌, ప‌గ‌ల‌న‌క‌, రేయన‌క తిరిగేది ఫైస‌లు.. ప‌లుకుబ‌డికోసం కాదు.. అన్న మీద అభిమానాన్ని చూపించ‌డానికి మాత్ర‌మే అనే ప‌సి మ‌న‌సులున్న వ్య‌క్తుల గురించి..

వాళ్ల‌కు ఇప్పుడు కొన్ని గంటలే మిగులున్నాయి. ఈ ఎలక్ష‌న్లు అయిపోగానే.. పొద్దున్నే అన్న నుంచి కాల్ రాదు. అన్న‌తో క‌లిసి ఇరానీ హోట‌ల్ లో ఛాయ్ తాగ‌లేరు. బీరు తాగుతుంటే.. కంప‌నీ ఇచ్చే అన్న ఎటు పోతాడో ఏమో.. మ‌ళ్లీ ఎలెక్ష‌న్ వ‌స్తేనే ఈ త‌మ్ములు గుర్తుకొస్తారు.

Final-clocks5 చివ‌రి ఘ‌డియ‌లు

గందుకే గా త‌మ్ముళ్లు జ‌ర యాదికి పెట్టుకోవాలే.. మొన్న సీఐతో గొడ‌వ‌కు దిగిన‌ప్పుడు మీ అన్న అడ్డు వ‌చ్చాడు కానీ.. ఇప్పుడు అదే సీఐ నీ గుడ్డ‌లు ఊడ‌దీసి కొట్టినా.. అడిగే నాథుడు ఉండ‌డు. అయిందేదో అయిపోయింది. ఈ జ్ఞాప‌కాలు యాదికి పెట్టుకో.. మ‌ళ్లోసారైనా ఒక‌నికి చెప్పులెక్క ప‌నిచేయ‌కుండా ఉంటావ్.. పిల్ల‌ల ఆర్త‌నాదాలు, నీ పెండ్ల ఆక‌లి కేక‌లు యాదికి పెట్ట‌కుని గీ చెప్పుకింద‌ ప‌నిచేసే ప‌నులు చేయ‌వు. అన్న ప‌క్క‌నుంటే ప‌గిలేది మ‌న పంగే అని తెలిస్త‌ది. నువ్వు ఓ కూర‌లో క‌రివేప‌కు లెక్క‌ని అర్థం అవుత‌ది.

ఈ కొన్ని గ‌డియాలు అయినా నీకు కావ‌ల‌సిన‌న్ని ఫొటోలు, గుర్తులు తీసుకో.. మ‌ళ్లీ ఈ రాజ‌కీయ ఉచ్చులోకి రాకుండా.. చెంచాగిరి చేయ‌కుండా.. వీళ్ల‌కోసం త‌న వాళ్ల‌తో పోట్లాడ‌కుండా.. నీ గ్యాంగ్ మారుత‌ది అన్న న‌మ్మ‌కం నాకు మాత్రం లేదు. కానీ నువ్వు మారుతావ‌ని అనిపిస్తుంది. అందుకే నీకు చెబుతున్న యాదికి పెట్టుకో.. రాజ‌కీయ కార్య‌క‌ర్త అంటే.. నాయకుల‌కు కాలుకింది చెప్పులే అని..

image_2021-03-13_121333 చివ‌రి ఘ‌డియ‌లు

రాఘవేందర్

ఫిల్మ్ డైరెక్టర్, హైదరాబాద్

raghavendra.a123@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

ఓటుకు నోటు త‌ప్ప‌క‌ తీసుకోవాల్సిందే..!

మ‌నం మారేదెప్పుడు ?

అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?

మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

Related Post