Breaking
Tue. Nov 18th, 2025

నిరుపేద కుటుంబాల‌కు ఇండ్లు క‌ట్టిస్తా..

Talakondapally ZPTC Uppala Venkatesh inaugurated the water plant centre in antharam
Talakondapally ZPTC Uppala Venkatesh inaugurated the water plant centre in antharam
  • తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్
  • ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వ‌ర్యంలో అంతారంలో నీటిశుద్ధి కేంద్రం ప్రారంభం

ద‌ర్వాజ-త‌ల‌కొండ‌ప‌ల్లి
ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ త‌న సేవ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత‌గా విస్త‌రిస్తోంది. తాజాగా త‌ల‌కొండ ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని అంతారం గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్‌, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్.. నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా గ్రామంలోని ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత‌మైన నీరు ల‌భిస్తుంద‌ని తెలిపారు.

నిరుపేద‌ల‌కు ఇండ్లు క‌ట్టిస్తా !
నీటిశుద్ధి కేంద్రం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం ఉప్పల వెంకటేష్ అంతారం గ్రామంలో వాడ వాడ తిరుగుతూ గ్రామ ప‌రిస్థ‌తుల‌ను తెలుసుకున్నారు. గ్రామ‌స్తులు ఎదుర్కొంటున్న సమ‌స్య‌లు, ఇత‌ర ప‌రిస్థితుల‌ను స్థానికుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇండ్లు లేని 25 నిరుపేద కుటుంబాల‌కు ఇండ్లు క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. అలాగే, మ‌రో మూడు కుటుంబాల‌కు వారి ఇంటి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స్టీల్, సిమెంట్, ఇటుక,ఇసుక ఇప్పిస్తానని తెలిపారు.

Talakondapally-ZPTC-Uppala-Venkatesh-inaugurated-the-water-plant-centre-in-antharam-1 నిరుపేద కుటుంబాల‌కు ఇండ్లు క‌ట్టిస్తా..

కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్, అంతారం సర్పంచ్ వెంకటయ్య, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య, వెంకటాపూర్ సర్పంచ్ రమేష్ , ఎంపీటీసీలు అంబాజీ, సునీత సుదర్శన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు కూన రవి, రాజవర్ధన్ రెడ్డి, కటికల శేఖర్, ఉప సర్పంచులు మల్లేశ్, అజీజ్, మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీదర్, నాగేశ్, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి, మండల నాయకులు జైపాల్ రెడ్డి, కిషోర్, తిరుమణి కృష్ణ రాఘవేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Post