పురాణాల‌కు నాంది నా తెలుగు!

telugu importance
telugu importance

శిథిలాల్లో పుట్టి,
త్రిలింగ పదము నుంచి జారిన బీజం ఇది.
హిందూ దేశ మట్టిలో
మహావృక్షంగా పెరిగిన తేజం..
మ‌న‌ తెలుగు భాష.
అందమైన అక్షరాలను శాఖలుగా చేసుకుని..
అంతులేని పదాలను ఆకులుగా పరుచుకుని..
సాటిలేని మకుటాలైన మ‌హా కవులను
పువ్వులుగా పూసేలా చేసింది నా తెలుగు.
కోటి ఫలాలను విద్యలుగా పంచింది
మన మాతృభాష తెలుగు.
అమ్మ ప్రేమను కమ్మగా తెలిపేది నా తెలుగు.
నాన్న బాధ్యతను, బరువును
భావయుక్తంగా చెప్పేది మ‌న‌ తెలుగు.
గురువు నేర్పే పాఠంలో
గమ్యాన్ని చూపేది ఈ తెలుగు.
సహస్రనామాలకు పుస్తకం మ‌నంద‌రి తెలుగు.
ఎన్నో మహా గ్రంథాలకు
పురాణాలకు నాంది నా తెలుగు.
భారతదేశపు అఖండ
ఖ్యాతికి సోపానం మ‌న‌ తెలుగు.

ashritha-reddy పురాణాల‌కు నాంది నా తెలుగు!

ఆనం ఆశ్రిత రెడ్డి (గంగ),

బీటెక్ స్టూడెంట్, ఖమ్మం జిల్లా,

మెయిల్: anamaasritha18@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Share this content:

Related Post