Breaking
Sat. Jun 28th, 2025

‘ప్లవ’ నామ సంవత్సరాది ‘ఉగాది’

Ugadi festival darvaaja.com
Ugadi festival darvaaja.com

తెలుగునాటే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయక నూతన సంవత్సరంగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగ గురించి మ‌న పురాణాల్లో ప‌లు కథలు ఉన్నాయి. వాటి ప్ర‌కారం.. ఉగ అనే ప‌దానికి నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అనే అర్థాలున్నాయి. వీటికి ఆది తోడై ఉగాదిగా అంటే హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం యుగ ప్రారంభాన్ని ఉగాది (యుగాది) అంటారు.

How-To-Make-Traditional-Ugadi-Pachadi_Ugadi-festival-1 'ప్లవ' నామ సంవత్సరాది ‘ఉగాది’

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం మొదటిరోజును ఉగాది పండుగగా, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌గా జ‌రుపుకుంటారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ సువిశాలమైన సృష్టిని ప్రారంభించారని విశ్వసిస్తారు. ఉత్తరాయణ, దక్షిణాయనం అనే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ కాగా, ఆ యుగానికి ఆది యుగాది (ఉగాది) అయిందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Ugadi-festival-2 'ప్లవ' నామ సంవత్సరాది ‘ఉగాది’

నేడు మంగ‌ళ‌వారం 13న తెలుగు నూతన సంవత్సరాది ఉగాది (శ్రీ ప్లవనామ సంవత్సరం) ప్రారంభమైంది. తెలుగువారి కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన ఈ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తే సకల శుభాలు క‌లుగుతాయ‌ని ప్రజల నమ్మకం. షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి ప్రత్యేకంగా ఉంటుంది.

తెలుగు వారితో పాటు యావ‌త్ భార‌తావ‌నికి ద‌ర్వాజ‌.కామ్ (darvaaja.com) త‌ర‌ఫున‌ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !

షడ్రుచుల స‌మ్మేళ‌నం.. ఉగాది ప‌చ్చ‌డి !

ఆయనొక అభ్యుదయ అక్షరజ్యోతి

భ‌విష్య‌త్తుపై స‌న్న‌గిల్లిన విశ్వాసం !

లింగ‌ స‌మాన‌త్వం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌న‌ట్టే !

నీటి బొట్టు.. బతుకు మెట్టు !

తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటా !

Related Post