Breaking
Tue. Nov 18th, 2025

లింగంధ‌న సర్పంచ్ మృతి.. వ్యాక్సినే కారణమా?

Sarpanch dies two days after COVID-19 vaccination in Telangana lingamdhana
Sarpanch dies two days after COVID-19 vaccination in Telangana lingamdhana
  • ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్న సర్పంచ్ మయూరి


ద‌ర్వాజ‌- రండారెడ్డి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం లింగంధన గ్రామ మహిళా సర్పంచ్ రాజమోని మయూరి ఆకస్మిక మృతి చెందారు. రాత్రి కొద్దిగా అనారోగ్యంతో పల్స్ పడిపోగా కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్తుండ‌గా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన‌ట్టు కుటుంబ సభ్యులు వెల్ల‌డించారు.

కాగా, మ‌యూరి వయస్సు 42 సంవత్సరాలు. ఈ నెల 14న ఆమె కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆమె కొద్దిగా అనారోగ్యంతో బాధపడ్డారు. రాత్రి అకస్మాత్తుగా పల్స్ పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స‌ర్పంచ్ మ‌ర‌ణంతో లింగ‌ధ‌నం గ్రామంలో విషాధఛాయ‌లు అల‌ముకున్నాయి.

Sarpanch-dies-two-days-after-COVID-19-vaccination-in-Telangana-1 లింగంధ‌న సర్పంచ్ మృతి.. వ్యాక్సినే కారణమా?

అయితే, స‌ర్పంచ్ మ‌యూరి మ‌ర‌ణానికి ఆమె బుధ‌వారం తీసుకున్న క‌రోనా టీకా కార‌ణ‌మా? లేదా ఆమెకు ఇదివ‌ర‌కు ఉన్న ఏమైన అనారోగ్య సమ‌స్య‌లు కార‌ణ‌మా అనేది తెలియాల్సి ఉంది. ఈ విష‌య‌మై వైద్యులు సైతం ఆరా తీసుకున్నార‌ని స‌మ‌చారం.

https://darvaaja.com/coronavirus-india-live-updates-2-lakh-new-corona-cases/

ఆయనొక అభ్యుదయ అక్షరజ్యోతి

భ‌విష్య‌త్తుపై స‌న్న‌గిల్లిన విశ్వాసం !

లింగ‌ స‌మాన‌త్వం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌న‌ట్టే !

నీటి బొట్టు.. బతుకు మెట్టు !

తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటా !

Related Post