ఓ జంటకు ‘కను’పాప
ఓ ఇంట వెలుగు దీప
మరో ఇంటికి గడప
ఆడవారి చిత్ర దీపిక.
అమ్మ కడుపున పుట్టి
ఆలనపాలనలో ఎదిగి
అక్కగా చెల్లిగా మురిసి
మెట్టింట అయ్యేను తల్లి.
ఆడ పిల్ల బొమ్మ కారాదు
ఆడదనే అలుసెందుకు
అమ్మ లేకుంటే ఏది జన్మ
ఆమెతోనే మొదలగు కర్మ.
ఆదిలక్ష్మి ఆమె రూపం
ఆదిశక్తి ఆమె స్వరూపం
ఆమె నవ్వితే ప్రకృతి
ఆమె వేదననే వికృతి.
అంతులేని అనురాగం
కమ్మనైన అమ్మదనం
సృష్టి మూలం ఆడదనం
ప్రకృతి ఆమెకు దాసోహం.
సర్వ లోకాలకు జగన్మాత
సర్వ ప్రాణికి ప్రాణదాత
లోకమెచ్చును లోకమాత
స్త్రీతత్వమే ఆడదనే ఆత్మ.
ఆడదనే హేళన వ్యర్ధం
ఆడదంటే మని’షిన సగం
ఆడువారు ఇంటికి దీపం
ఆడజన్మే జగతికే మూలం.
అమ్మగా ముర్రుపాలిస్తుంది
సోదరై కన్నీరు తుడుస్తుంది
అర్ధాంగిగా గడుపుతుంది
కూతురే తల్లిగా చూస్తుంది.
అమ్మలందరికి వందనం
ఆడబిడ్డకు అభివందనం
కన్నబిడ్డకు అభినందనం
మగువ తెగువ ఆద్యంతం.
అభినందన కుసుమ సువార్చనలతో అర్పిస్తూ
మహిళా లోకానికి జేజేలు.

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..