గత మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సీఎంకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మెరుగైన వైద్యం కోసం.. ఆయనను బుధవారం సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించనున్నారు.
సాధారణ వైద్య పరీక్షలు, ఛాతి సీటీ స్కానింగ్ కోసం ఆయన యశోదా ఆస్పత్రికి వస్తున్నట్టు తెలుస్తుంది. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఫామ్‌హౌస్‌కి వెళ్లనున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఫామ్ హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్న సీఎం కేసీఆర్ కు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని యశోదా ఆస్పత్రి వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.