దర్వాజ-హైదరాబాద్
జీవితం అన్నది ఓ నడిచే పుస్తకం
పుటలు తెరిచే కొద్ది గత స్మృతులు
పుంఖానుపుంఖాలుగా జ్ఞాపకాలు,
అందున ఎన్నో
మరువజాలని మధుర గీతికలు.
ఎన్నో అధ్యాయాలు ఎన్నో అనుభవాలు
ఎన్నెన్నో సూచికలు ఎన్నెన్నో శీర్షికలు
చరిత్ర చెప్పే నిజాలు, దాగిన సత్యాలు
సాక్ష్యంగా నిలిపే నిజం
నిరూపించ దగిన అసత్యం.
బాల్యపు నడక
కౌమార కేరింత
యవ్వన పరుగు
మధ్య వయస్సు భాధ్యత
మలి దశలోని బరువు
ఆఖరికి అంతిమయాత్ర
జీవన ముగింపు.
పుస్తకం అవ్వాలంటే జీవితం నడవాలి.
ఆ నడకనే జీవితం అవ్వాలి, అవుతుంది.
ఆ నడకనే ఎవరి జీవిత పుస్తకంలో వారే
కధా నాయకి, నాయకుడు
అని తెలుపుతుంది.
నాయకి,నాయకుడి చరిత్రే
ఆ పుస్తకం.
ప్రతి కధలో మరెన్నో
పాత్రలు ఉంటుంది.
అవి కుటుంబానికి సంబంధం కలిగి ఉండవచ్చు,
లేక పోవచ్చు.
కాని ఆ పాత్రల ప్రభావంతో కధ మారుతుంది.
జీవన కధలో మారే పదం.
అది ప్రధాన పాత్రలపై పెను ప్రభావం చూపుతుంది.
పుస్తక కధనంలో అనేక సంకటాలను రేకిస్తాయి.
మరెన్నో సంబరాలను కల్పిస్తాయి.
ఎన్నెన్నో స్మృతులు
అన్ని అనుబంధాల మయం.
అక్షరం, అక్షరం జోడయితే పదంగా మారి
అనేక పదాల కలయిక పుటగా మారితే
అనేక పుటలు పుస్తకంగా మారుతుంది.
అలానే వ్యక్తి, మరో వ్యకితో జోడయ్యి
ఆ జోడి అనుభవం అయ్యితే
ఆ అనుభవాల సారం కుటుంబం కాగా
ఆ కుటుంబ విధానమే
జీవన పుస్తకం అవుతుంది
జీవితం అన్నది ఓ నడిచే పుస్తకం.
అది ఓ కమ్మని కావ్యం.

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
