దర్వాజ-హైదరాబాద్
బ్రహ్మ ఇచ్చిన బహుమానం
జీవులకిచ్చిన అనుబంధం
అమ్మతనం నరులపాలు
ఆకలి తీర్చే పొదుగు పాలు.
కంటేనే అమ్మ కాదురా
పెంచిన ప్రతిహృదయం
అమ్మ రూపమే కదరా
ప్రేమ పంచిన మనిషిరా.
ముర్రు పాలైన ఉగ్గుపాలైన
బిడ్డ ఆకలి తీర్చు వైనం
దేవుడే కలిపేను బంధం
విడదీయని అనుబంధం.
రెప్పవాల్చక కనిపెట్టు
రేయి పగలు వెన్నంటు
బిడ్డ ఆకలి తీర్చును
తానాకలిదప్పిక మరచు.
మొక్క ఎదిగే తరుణంలో
విరుపు బద్దె తోడయ్యే
అమ్మగాని అమ్మవోలె
మానుగా ఎదిగే క్రమంలో..
తాను గనని బిడ్డను
పొదిగేను కాకి గూటిలో
నల్లవన్నీ ఏక రీతేను
గొంతుక కోయిలే మారే.
ఆ కాకమ్మ గూటిలోన
ఓ కోయిలమ్మ పెరిగేను
అమ్మతనంకో సాక్ష్యము
పొదుగుపంచే పక్షిగుణము.
కంటేనే అమ్మ కాదురా
పెంచిన ప్రేమన తల్లి
దేవుడిచ్చిన బహుమతి
అమ్మయను రూపమురా.
అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
Share this content: