Breaking
Tue. Nov 18th, 2025

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు

Lockdown extends in Telangana 1
Lockdown extends in Telangana 1

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో ఇదివ‌ర‌కే లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ఆయన మంత్రుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల లాక్ డౌన్ విధించింది. కాగా, తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Related Post