Breaking
Tue. Nov 18th, 2025

కడచూపు కరువై.. !

corona crisis darvaaja
corona crisis darvaaja

ప్రపంచమంతా…

కరోనా రోగం బారిన పడి
నమ్ముకున్న నన్ను వదిలి
అంతలోనే మాయమయ్యి
సుదూరాలకు వెళ్ళిపోయి.

క్రిమి కాటుకి బలైయ్యావు
కాటికి చాటుగా పోయావు
కనరాకన కాలి పోయావు
నేల అడుగునకు చేరావు.

కనుచూపున చూడలేదు
ఆఖరి చూపు అందలేదు
వంటరిని చేసి పోయావు
లోకాన అనాధగా చేసావు.

నీవు ఊపిరి వదిలేసావు
తిరిగి రాలేవని తెలుసు
తోడు లేక కుమిలిపోతు
వేదన రోదనలే మిగులు.

చేతిన చెయ్యేసిన బాసలు
వీడనని చెప్పిన మాటలు
తెలిసే నీటి మీద రాతలు
నీవొస్తావన్న కలలు కల్లలు.

లోకాన పచ్చని సంసారం
కరోనా మిగిల్చిన విషాదం
భార్యకు భర్తకు వియోగం
బిడ్డలకు దిక్కు లేనితనం.

ఒంటరైనవి కుటుంబాలు
ఆగని విషాద ఛాయలు
ప్రపంచమంతా వేదనలు
కన్నీట మనిషి రోదనలు…

ఓ మానవా నీవు మారాలి
అనాధల చెంతకు చేరాలి
ప్రతి బిడ్డను అక్కున చేర్చి
భవితనివ్వు మహా మనిషి..

ashoka-chakravarthy-neelakantam-darvaaja.com_-775x1024 కడచూపు కరువై.. !

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Related Post