Breaking
Sat. Jun 28th, 2025
#telangana formation day #darvaaja.com #దర్వాజ
#telangana formation day #darvaaja.com #దర్వాజ

నాడొక తెలంగాణ పోరు
నేడొక తెలంగాణ జోరు
స్వీయస్వపరి పాలన కోరు
ఆత్మ బలిదానాల హోరు.

రగిలే మంటలు జ్వాలలై
పిడికిలి బిగించి చైతన్యమై
దశాబ్దాల సాగే పోరాటమై
నవ తెలంగాణ సాకారమై..

ఢిల్లిపాలనపై కత్తెత్తిన యోధ
సర్దార్.పాపన్నగౌడ్ ధీరుడై
భువనగిరిన రాజ్యమేలి
గొల్కొండన తలన వ్రేలాడే.

తెలంగాణ తొలి యోధుడు
భావి తరానికి ఊపిర్లూడి
స్వేచ్ఛ విప్లవాగ్ని రగిలించి
తానొకసమిధైన ధీరుడు.

తొలి దశపు పోరాటంలో
ఆత్మార్ఫణలో యువకులు
రగిలించే నిప్పుల కెరటాలు
స్వతంత్ర రాష్ట్ర జ్యోతులు.

పాలకులు వేసిన పాచికలు
ఉద్యమం చతికిల పడంగా
చాపకింద నీరులా సాగేను
మూడు దశాబ్దాల మౌనం.

రాజకీయ చిత్రం మారే
ఓ నిప్పు కణిక రాజేసే
తెలంగాణ స్వరం పెరిగే
పరాయి పాలన కాదనే.

మా నిధులు మానీళ్ళంటూ
మానియామకాలు అంటూ
తెలంగాణ రణ నినాదాలు
పదు నాల్గేళ్ళ పోరాటాలు.

పోరాట సమితి పేరుతో
తెలంగాణ పోరు మొదలై
స్వరాష్ట్ర ఏర్పాటుకాంక్షించి
సంకల్పించేను తెలంగానం.

కేసిఆర్ చేసిన నిరహార ధీక్ష
సకల జనులు చేసిన సమ్మె
ఉద్యోగి విద్యార్ధి కలిసి జేసే
ఉద్యమాన ప్రజల పోరు.

యాదగిరి, శ్రీకాంత చారీ
చేసిన ఆత్మ బలిదానాలు
జనం చేసిన పోరాటాలు
రహదారుల దిగ్బంధాలు.

కేంద్రమే దిగి వొచ్చేను
జనం కోరికను తీర్చేను
తెలంగాణ రాష్ట్రమొచ్చె
స్వతంత్ర పాలన తెచ్చే.

యేలు బంగారు తెలంగాణ
జేయు కోటిఎకరా మాగాణ
నేటి పాలన చేయు గణన
స్వేచ్చా గొంతు ప్రాంగణాన.

ashoka-chakravarthy-neelakantam-darvaaja.com_-775x1024 తెలంగాణ పోరు - హోరు..!

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Related Post