‘సరిగమపదనిస’లను
సంగీత బీజాక్షరాలుగా
కంఠంలో దాచుకున్న
గాన గంధర్వుడు
బాల సుబ్రహ్మణ్యం.
అవపోసనగా రాగం పట్టి
అక్షర మాలను ఇష్టగా మార్చి
అర్ధం ఒకటైన బాషలు వేరైన
అనుకున్న బాణీలో గానం.
కోయిల గొంతున కమ్మదనం
సింహనాదపు గర్జింపు
ఐరావతపు ఘీంకరణ
పులి గాండ్రింపుల ప్రకృతిలోని
స్వరముల మేళవింపున
పల్లవింపు ఆయనకే సొంతం.
మాటలతో పాటలు
నయాగరా జల నడకలు
సుస్వరాల మీటలు
గగన తీరపు ధ్వనులు
శబ్ద అనుకరణ దానితో
ప్రణయనాదం వారి సొంతం.
పాటనే ప్రాణమాయే
గానమే జీవనమాయే
సరిగమల సావాసమే
బాలు జీవితమాయే.
పాటకు స్వరంతో
జీవం పోసి
పాటనే కదిలేలా
పాటనే కదిలించేలా
పాటకి కదలి వచ్చేలా
పాటన పల్లవి చరణాల కేళి
పాట పాడే వినసొంపుగా.
గానం అతనికి వరం
గాత్రం అతని సుస్వరం
గేయం అతని జీవం
గమనం అతని జీవితం.
ఆహా!. నరుడా ఏమి అదృష్టం
గానకోయిలీ మానవుడి గానం
రాగం తానం పల్లవి కలసిన
గానామృత సుస్వరం బాలు.
ప్రళయమైన, ప్రణయమైన
యుగళ రాగమైన, విప్లవ గీతమైన అతని గళమున జాలువారితే
అది శబ్దానికి భాష్యం చెప్పినట్లే….
శ్రోతలకు విన సొంపుగా
సుప్రీత స్వర వాన కురిసినట్లే…
స్వర్గీయ యస్.పి బాలసుబ్రమణ్యం (బాలు)గారికి
అభినందన నీరాజనం.

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..