Loading Now
corona delta plus variant

వామ్మో.. డెల్టాప్లస్‌ వేరియంట్‌ !

  • కొత్త క‌రోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన ఎందుకు?

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

గతేడాది వెలుగు చూసిన కరోనా మహమ్మారి అనేక ఉత్పరివర్తనాలు చెందుతూ.. తన రూపును మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ప్రపంచ దేశాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పలు రకాల వేరియంట్లు తీవ్ర స్థాయలో విజృంభించి.. పరిస్థితితులను మరింత దారుణంగా మార్చాయి. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌కు కారణమైన డేల్టా వేరియంట్‌.. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ప్రస్తుతం ఈ డెల్లా వేరియంట్‌ కాస్తా మ్యూటెంట్‌ అయి డెల్టాప్లస్‌గా (ఏవై1 వేరియంట్‌) మారింది. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. డెల్టాప్లస్‌ వేరియంట్‌ నేపథ్యంలో బ్రిటన్‌లో జులై 19 వరకు ఆంక్షలు పొడిగిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరీస్‌ జాన్సన్‌ ప్రకటించారు. అమెరికా స‌హా ప‌లు దేశాలు దీనిపై ప‌రిశోద‌న‌లు సాగిస్తున్నాయి.

డెల్టాప్ల‌స్ వేరియంట్‌పై ఎందుకంత ఆందోళ‌న‌?

ఇదివరకే గుర్తించిన క‌రోనా డెల్టా వేరియంట్‌ను ప్రమాదకర మ్యూటెంట్‌లలో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. ఈ వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడాఁకి ప్రధాన కారణం.. ఇప్పటివరకూ కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను చికిత్సకు వ్యతిరేక ఈ వేరియంట్ ప్ర‌తిఘ‌ట‌న చూపిస్తోంది. అందుకే స‌ర్వ‌త్రా అందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. అయితే, భార‌త్‌లో మాత్రం డెల్టాప్ల‌స్ వేరియంట్ ఎక్కువ‌గా లేద‌నీ, ఈ నెల 7 (జూన్ 7) వ‌ర‌కు భార‌త్ లో మొత్తం ఆరు జీనోమ్స్ లో మాత్ర‌మే డెల్టా ప్ల‌స్ వేరియంట్ గుర్తించిన‌ట్టు ప‌రిశోధ‌కులు, వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు.

డెల్టాప్ల‌స్ వేరియంట్‌పై ప‌రిశోధ‌కులు ఏమంటున్నారు?

డెల్టాప్లస్‌ వేరియంట్‌ గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. కే417ఎన్‌ మ్యుటేషన్‌ ద్వారా కరోనా బీ1617.2 వేరియంట్‌ వచ్చినట్టు వెల్లడించారు. దీని నుంచి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ (బీ1617.2.1) ఉత్పన్న‌మైంది. ఈ కే417ఎన్‌లోనూ రెండు గ్రూపులు ఉండ‌గా.. అందులో చాలా దేశాల్లో గుర్తించారు. మరొకటి అమెరికాలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీసీఎస్‌వో) పరిశోధనలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జీఐఎస్‌ఏఐడీలో జరిగిన 63 జీనోమ్‌ సీక్వెన్స్‌లలో డెల్టా ప్లస్‌ వేరియంట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్‌, స్విట్జర్లాండ్‌, భారత్‌, పోలాండ్‌, పోర్చుగల్‌, జపాన్‌, అమెరికా దేశాల‌కు చెందినవి. ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు యూకేలో 36, అమెరికాలో మొత్తం కేసుల్లో 6 శాతం ఉన్నట్టు గుర్తించారు.

Share this content:

You May Have Missed