Loading Now
AP government_Anandaiah medicine

ఆనందయ్య మందు ప్రమాదకరమన్న ప్రభుత్వం !

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి

క‌రోనా విజృంభిస్త‌న్న త‌రుణంలో దేశవ్యాప్త చ‌ర్చ‌కు తెర‌లేపింది ఆనంద‌య్య మందు. దీనిపై భిన్న ర‌కాల వాద‌న‌లు వినిపించినా చివ‌రికి ఈ మందుకు తీసుకున్న వారితో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు, కేంద్ర ఆయూష్ విభాగం అధికారులు సైతం సానుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని ఆనంద‌య్య మందుకు ఒకే చెప్పింది. న్యాయ‌స్థానాల్లోన‌నూ దీనిపై వాద‌న‌లు జ‌రిగాయి.

తాజాగా ఆనంద‌య్య క‌రోనా మందుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానంలో వాద‌న‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలోనే ఆనంద‌య్య మందులో హ‌నిక‌ర ప‌ద‌ర్థాలు ఉన్నాయ‌ని రాష్ట్ర త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వెల్ల‌డించారు. కంటి చుక్క‌ల మందును ఐదు ల్యాబుల్లో ప‌రీక్షించామ‌నీ, ఇందులో ఒక హ‌నిక‌ర ప‌దార్థం ఉన్న‌ట్టు వెల్ల‌డైంద‌న్నారు. కాగా, దానికి సంబంధించిన రిపోర్టుల‌ను త‌మ‌కు అందించాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. వాద‌న‌ల సంద‌ర్భంగా చుక్క‌ల మందును ఆయుష్ రీసర్చ్ సెంటర్ లో ప‌రీక్షించాల‌ని ఆనంద‌య్య త‌ర‌ఫు లాయ‌ర్ కోర్టును కోరారు. త‌దుపరి విచారణ జులై 1న జ‌ర‌గ‌నుంది.

ఇదిలా ఉండ‌గా, గ‌త 16 సంవ‌త్స‌రాలుగా తాను కంటి మందును ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నాన‌నీ, ఎవ‌రికీ ఇబ్బందులు క‌ల‌గ‌లేద‌ని ఆనంద‌య్య వెల్ల‌డించారు. త‌న మందు తీసుకుని ఎవ‌రికైనా కంటి స‌మస్య‌లు వచ్చాయ‌ని చెబితే.. తాను ఆ మందును ఇవ్వ‌బోన‌ని తెలిపారు. త‌న పేరు చెప్పుకుని మందును బ్లాక్ మ‌ర్కెట్ చేస్తున్నార‌నీ, అలాంటి వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని ఆనంద‌య్య ప్రభుత్వాన్ని కోరారు.

Share this content:

You May Have Missed