Breaking
Tue. Nov 18th, 2025

డెల్టా వేరియంట్‌తో తీవ్ర ముప్పు !

Delta Covid-19 variant
Delta Covid-19 variant

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

ఇప్పటివరకు వెలుగుచూసిన కరోనా మ్యూటెంట్లలో అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్‌పై అమెరికా వైట్‌హౌస్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇది తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశముందని పేర్కొన్నారు. రెండు వారాల క్రితం 10 శాతంగా ఉన్న డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 20 శాతానికి చేరిందన్నారు. డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణముందనీ, వ్యాధి తీవ్రతకు సైతం కారణమవుతోందన్నారు. ఈ మ్యూటెంట్‌ కట్టడికి కలిసికట్టుగా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుందామ‌ని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని ఫౌచీ పేర్కొన్నారు. కాగా, డెల్టా వేరియంట్‌ అమెరికా, భారత్‌, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో కేసుల పెరుగుదలకు కారణమవుతోంది.

Related Post