Breaking
Tue. Nov 18th, 2025

టోక్యో ఒలంపిక్స్ లో భార‌త్‌కు మూడో మెడ‌ల్‌

boxer Lovlina for bagging bronze in Tokyo Olympics
boxer Lovlina for bagging bronze in Tokyo Olympics
  • కాంస్య పత‌కం గెలిచిన మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన ల‌వ్లీనా

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

టోక్యో ఒలంపిక్స్ 2020లో భార‌త్‌కు మూడో ప‌త‌కం ద‌క్కింది. మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్ సెమీ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా టర్కీ బాక్సర్ బుసెనజ్ సుర్మెనెలీ చేతిలో ఓటమి పాలయ్యారు. లవ్లీనాపై టర్కీకి చెందిన వరల్డ్ నంబర్ వన్ బుసెనజ్ 5-0 తేడాతో విజయం సాధించ‌డంతో ల‌వ్లీనాకు కాంస్య పత‌కం ద‌క్కింది. దీంతో ఒలంపిక్స్ లో మెడ‌ల్ సాధించిన మూడో బాక్స‌ర్ గా చ‌రిత్ర సృష్టించింది. అరంగేట్రంలోనే మెగా క్రీడల్లో పత‌కం సాధించిన ల‌వ్లీనాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

కాగా, బాక్సింగ్ లో దాదాపు 9 ఏండ్ల త‌ర్వాత ఒలంపిక్స్ క్రీడ‌ల్లో భార‌త్‌కు మెడ‌ల్ ద‌క్కింది. ఇదివ‌ర‌కు 2008లో విజేందర్‌, 2012లో మేరీకోమ్ లు బాక్సింగ్‌లో ప‌తకాలు సాధించారు.

Related Post