Breaking
Tue. Nov 18th, 2025

పిడుగుల దెబ్బకు 24 మంది మృతి

lightning 24 people kill
lightning 24 people kill

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

lightning 24 people kill : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం కొన‌సాగింది. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో పిడుగులు ప‌డి ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 12 మంది గాయ‌ప‌డ్డారు. అధికంగా జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పిడుగుపడి 8 మంది మ‌ర‌ణించారు. చ‌నిపోయాన వారిలో ఇద్దరు బాలికలు, రైతు ఉన్నారు.

అలాగే, బీహార్‌లోని బంకా ప్రాంతంలో పిడుగులు ప‌డి ఏడుగురు చ‌నిపోయారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌, భద్రక్‌, బాలాసోర్‌ జిల్లాల్లోనూ పిడుగులు ప‌డ్డాయి. దీంతో ఐదుగురు మ‌ర‌ణించారు. బెంగాల్ లోని నందిగ్రామ్‌, ఈస్‌ బర్ద్‌వాన్‌ జిల్లాల్లో పిడుగులు ఐదుగురు మ‌ర‌ణించారు. మ‌రో ఏడుగురు గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Related Post