Breaking
Tue. Nov 18th, 2025

తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి ఎక్సలెన్స్ మెడల్

Union Home Minister’s Medal For Excellence
Union Home Minister’s Medal For Excellence

◙ ఎక్స‌లెన్స్ మెడ‌ల్స్ ప్ర‌క‌టించిన కేంద్రం

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Union Home Minister’s Medal For Excellence: స్వ‌తంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్కంచుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎక్స‌లెన్స్ మెడ‌ల్స్ ప్ర‌క‌టించింది. 2021 ఏడాదికిగానూ ‘కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ను 152 మంది పోలీసు సిబ్బందికి ప్ర‌దానం చేయ‌నున్నారు. ఇందులో సీబీఐతో పాటు ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ సిబ్బందిని సైతం ఎంపిక చేసింది. అలాగే 28 మహిళా పోలీసులు సైతం ఉన్నారు. నేర పరిశోధనలో అత్యుత్తమంగా ప్రతిభ చూపిన వారికి ఈ మెడ‌ల్స్ 2008 నుంచి కేంద్రం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఎక్స‌లెన్స్ మెడ‌ల్స్ కు అందుకునే వారి జాబితాలో మొత్తం 152 మంది ఉండ‌గా, వారిలో తెలంగాణ నుంచి ఐదుగురు ఉన్నారు. వారు నాయిని భుజంగరావు (ఏసీపీ), ఏ మధుసూదన్‌ (డెప్యూటీ ఎస్పీ), ఎన్‌ శ్యామ్‌ ప్రసాద్‌రావు (ఏసీపీ), జీ శ్యామ్‌ సుందర్‌ (ఏసీపీ), నెనావత్‌ నగేశ్‌ (ఎస్‌ఐ) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

గ్లోబల్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌.. భారత్‌ ర్యాంకు..?

హిమాచల్‌లో విరిగి కొండచరియలు

ఈ అవార్డులు అందుకుంటున్న వారిలో 15 మంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి చెందిన వారు ఉన్నారు. అత్య‌ధికంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్రల ఒక్కో రాష్ట్రం నుంచి 11 మంది ఉండ‌గా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్‌ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడులో 8 మంది, బిహార్‌ నుంచి ఏడుగురు, గుజరాత్‌, కర్నాట‌క‌, ఢిల్లీ నుంచి ఆరుగురు పోలీసులను ఎక్సలెన్స్‌ మెడల్స్‌ వరించాయి. మిగ‌తావారు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన వారు ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఐదుగురికి ఈ మెడ‌ల్ అందించ‌నున్నారు.

Related Post