Breaking
Tue. Nov 18th, 2025

ముంచుకొస్తున్న డెల్టా ముప్పు

elta variant Danger World Health Organization Concern
elta variant Danger World Health Organization Concern

◙ వ్యాక్సినేష‌న్ వేగం పెంచండి
◙ ప్ర‌పంచ దేశాలు డ‌బ్ల్యూహెచ్‌వో సూచ‌న

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
delta variant Danger World Health Organization :భార‌త్‌లో మొద‌ట‌గా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ ర‌కం క‌రోనా వైర‌స్ ప్రపంచంలోని అన్ని దేశాల‌కు వ్యాపించింది. చాలా దేశాల్లో డెల్టా పంజా విసురుతున్న‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మ‌రీ ముఖ్యంగా అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ వేరియంట్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. వీటితో పాటు చాలా దేశాల్లో డెల్టా ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్న‌ద‌నీ, దీని కార‌ణంగా ప్ర‌జ‌లు ప్రాణాలు అధికంగా పొకుండా కాపాడ‌టం కోసం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల్సిన అవ‌స‌రమున్న‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది.

డెల్టా వేరియంట్‌తో పాటు ప్ర‌స్తుతం మ‌రో నాలుగు క‌రోనా వేరియంట్లు ప్ర‌మాద‌క‌ర స్థాయిలో వ్యాపిస్తున్నాయ‌ని తెలిపింది. దీని కార‌ణంగా ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య మ‌ళ్లీ పెరుగుతున్న‌ద‌ని వెల్ల‌డించింది. ముఖ్యంగా పేద దేశాల్లో క‌రోనా కార‌ణంగా ప‌రిస్థితులు దారుణంగా మారాయిని తెలిపింది. అలాగే, 7.7 బిలియన్ డాలర్లతో కూడిన ర్యాపిడ్ ఏసీటీ-ఆక్సిలరేటర్ డెల్టా రెస్పాన్స్ (రాడార్) అనే అనే ప‌థ‌కాన్ని ప్ర‌తిపాదిస్తూ.. వచ్చే నాలుగు నెలల్లో ఆమోదించాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది.

Related Post