Breaking
Tue. Nov 18th, 2025

శ‌శిథ‌రూర్ కు క్లీన్ చిట్

Sunanda Pushkar Death Case
Sunanda Pushkar Death Case

భార్య సునంద పుష్క‌ర్ మృతి అభియోగాల‌ను కొట్టివేసిన కోర్టు

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
Sunanda Pushkar Death Case: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట లభించింది. ఆమె మ‌ర‌ణానాకి సంబంధించి థ‌రూర్ పై పేర్కొన్న అభియోగాలన్నింటిని ఢిల్లీ ప్రత్యేక న్యాయ‌స్థానం కొట్టిపారేసింది. తాజాగా ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయెల్ తీర్పును వెలువరించారు. కాగా, 2014 జనవరి 17న శశి థరూర్‌ భార్య సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. దీనికి కార‌ణం శశి థరూర్ అంటూ ఆయ‌న‌పై పై పలు సెక్షన్ల కింద నేరారోపణలు మోపారు. సునందను శ‌శిథ‌రూర్ చిత్ర హింస‌ల‌కు గురిచేశార‌నీ, ఆయ‌న చ‌ర్య‌ల కార‌ణంగా ఆమె తీవ్ర మాన‌సిక క్షోభ‌ను అనుభ‌వించింద‌ని అప్పట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు.

కోర్టు తాజా తీర్పు నేప‌థ్యంలో స్పందించిన శ‌శి థరూర్.. తీర్పుపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు ఏడున్న‌రేండ్ల నుంచి అనుభ‌విస్తున్న ఈ బాధకు విముక్తి లభించందంటూ పేర్కొన్నారు.

Related Post