దర్వాజ-లక్నో
Former Uttar Pradesh CM Kalyan Singh passes away in Lucknow: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కన్నుమూశారు. 89 ఏండ్ల కల్యాణ్‌సింగ్ అనారోగ్యంతో జూలై 4న ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కళ్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కాగా, కళ్యాణ్ సింగ్ యూపీకి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, 2014-2019 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా సేవలందించారు. కళ్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్న సమయంలోనే అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగించారు. తిరిగి 1998 ఫిబ్రవరి నుంచి 1999 నవంబర్ వరకు రెండో సారి ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ పనిచేశారు.