Breaking
Tue. Nov 18th, 2025

కాబుల్‌లో బాంబు పేలుడు.. 20 మంది మృతి

Afghanistan Kabul Blasts
Afghanistan Kabul Blasts

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం
Kabul airport blast: ఆఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 20 మంది చనిపోయారని ప్రాథమిక సమాచారం. ఇందులో అధికంగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. పేలుడు విషయాన్ని పెంటగాన్‌ ధ్రువీకరించింది. కాబుల్‌ పేలుళ్లలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ అన్నారు. దీనిని అత్మాహుతి దాడిగా భావిస్తున్నట్టు వెల్లడిరచారు.

ఈ పేలుళ్లలో తాలిబన్లు సైతం గాయపడ్డారనీ, వీరి సంఖ్య అధికంగానే ఉందని స్థానికులు పేర్కొన్నారు. కాగా, అమెరికా నిఘా వర్గాలు కాబూల్‌ విమానాశ్రయ పరిసరాల్లో బాంబు దాడులు జరగవచ్చని హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు విమానాశ్రయ పరిసర ప్రాంతాలను వీడాలని తమ పౌరులను హెచ్చరించాయి.

ఆఫ్ఘానిస్థాన్ రాక్షస పాలన | తాలిబన్ షరియా చట్టమేంటి? 

క‌రోనాతో అనాథ‌లైన ల‌క్ష మంది చిన్నారులు

వాట‌ర్ బాటిల్ రూ.3 వేలు.. ప్లేట్ భోజ‌నం రూ.7 వేలు

మైసూర్‌లో విద్యార్థినిపై సామూహిక లైంగిక‌దాడి

ఆఫ్ఘాన్ల‌పై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?

Related Post