Breaking
Sat. Jun 28th, 2025

రోజూ చికెన్ తింటే ఇంత డేంజరా?

chicken curry side effects
chicken curry side effects

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

chicken curry side effects: వేడి వేడిగా చికెన్ లాగిస్తుంటే వచ్చే మజానే వేరు కదా. కొందరైతే చికెన్ మీదున్న ఇష్టంతో ప్రతిరోజూ తింటూ ఉంటారు. ఇష్టంగా తినే ఈ కోడి ముక్కల వల్ల వచ్చే అనర్థాలను మాత్రం అస్సలు పట్టించుకోరు. చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినా.. ప్రతిరోజూ తింటే మాత్రం మన ఆరోగ్యానికి గండిపడినట్టేనండోయ్. రోజూ మనం తినే ఆహారాల్లో 35 శాతం మాత్రం ప్రోటీన్స్ ఉండాలి.

అంటే కేవలం మనం ప్రతి రోజూ 50 గ్రాముల చికెన్ మాత్రమే తినాలి. కానీ మనలో చాలా మంది మోతాదుకు మించి చికెన్ తింటారు. దీని మూలంగా ఫ్యాట్ పెరిగి.. శరీరం బరువు పెరిగడం మొదలవుతుంది. దీంతో పాటుగా బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదెంతో ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చెకెన్ అతిగా తినడం వల్ల రక్త నాళాల్లో ఫ్యాట్ నిల్వలు పెరిగిపోతూ.. హార్ట్ ఎటాక్ కు కూడా దారి తీస్తుంది.

కాగా కోళ్లు తొందరగా లావు కావడానికి, పెరగడానికి విషపూరితమైన యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు వాటికి ఇస్తుంటారు. సో చికెన్ను తింటున్నాం అంటే ఆ విషయాన్ని కూడా మనం తింటున్నట్టే లెక్క. సో ఇప్పటికైనా ఇష్టంగా తినే చికెన్ను పక్కన పెట్టండి. వాటికి బదులుగా మంచి ప్రోటీన్స్ లభించే చేపలు, గుడ్లు, పప్పులు, బాదం వంటివి తినండి. అంతగా చికెన్ తినాలనుకుంటే అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

సింగ‌రేణి కాల‌నీ ఘ‌ట‌న నిందితుడు ఆత్మ‌హ‌త్య

మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్స‌వం’

గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు

మీడియాపై మంచు మ‌నోజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు

గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య

ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం

Related Post