దర్వాజ-లక్నో
uttar pradesh rape case: ఉత్తరప్రదేశ్ లో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుండటం.. మహిళల రక్షణపై అనేక ప్రశ్నలను లేవదీస్తోంది. అలీఘఢ్‌లో నాలుగేండ్ల దళిత బాలికపై హత్యాచార ఘటన కలకలం రేపింది. గోండా ప్రాంతంలో ఇంటివద్ద ఆడుకుంటూ గత ఆదివారం అదృశ్యమైన బాలిక ..అలీఘఢ్‌లోని ఓ పంట పొలంలో విగతజీవిగా పడిఉండటం కనిపించింది.
బాలికకు సమోసా కొనిస్తానని చెప్పిన స్థానికంగా ఉండే వ్యక్తి మద్యం మత్తులో బాధితురాలిని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆధారాలు లేకుండా బాలికను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
కుండపోత వర్షం.. నీటమునిగిన హైదరాబాద్
పెగాసస్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మమత ఫైర్