Loading Now
farmers protest

రైతుల‌పైకి దూసుకెళ్లిన కేంద్ర‌మంత్రి కాన్వాయ్‌.. 8 మంది మృతి

• ప్ర‌భుత్వ తీరుపై భ‌గ్గుమంటున్న రైతు సంఘాలు
• యూపీలో ఉద్ర‌క్త‌త ప‌రిస్థితులు

ద‌ర్వాజ‌-ల‌క్నో
farmers’ protest: కేంద్ర‌మంత్రి కాన్వాయ్ రైతుల‌పైకి దూసుకెళ్ల‌డంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్ప‌యిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. దీంతో రైతు సంఘాలు ప్ర‌భుత్వ తీరుపై భ‌గ్గుమంటున్నాయి. రైతుల ఆందోళ‌న హింసాత్మ‌కంగా మార‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. లకింపూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, లఖింపూర్ ఖేరిలో హింసలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారని లఖింపూర్ ఖేరి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై రైతులు సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. సోమ‌వారం దేశంలోని అన్ని జిల్లా మెజిస్ట్రేట్ల కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతు నాయకుడు రాకేశ్ టికాయ‌త్ స‌హా హ‌ర్యానా, పంజాబ్ ల నుంచి అనేక మంది రైతులు యూపీకి వెళ్తున్నారు.


https://twitter.com/TikriUpdates/status/1444620665785622530

లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !

లాల్ బహదూర్ శాస్త్రి మ‌ర‌ణం వెనుక కార‌ణాలు..

యూపీలో మ‌రో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి.. హ‌త్య !

నిజామాబాద్‌లో యువ‌తిపై గ్యాంగ్ రేప్

అక్టోబ‌ర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక

కుండ‌పోత వ‌ర్షం.. నీట‌మునిగిన హైద‌రాబాద్

భార‌త్ బంద్

పెగాస‌స్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మ‌మ‌త ఫైర్

Share this content:

You May Have Missed