దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Sneezing : శరీరంలోకి ఏదైనా చెడు పదార్థం వెళ్లేటప్పుడు.. మస్తిష్కం ఆ వ్యర్థ పదార్థం బయటకు పంపమని ఆదేశించడంతో తుమ్ము ఆటోమేటిక్ గా వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ చాలా మటుకు పెళ్లిళ్లు, శుభకార్యాలున్నప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే అపచారంగా భావిస్తుంటారు. కొందరైతే ముందే తుమ్మొద్దని హెచ్చరిస్తుంటారు.
అయితే ఇలాంటి సమయాల్లోన్నే కొందరు తుమ్ము వచ్చినప్పుడు ముక్కుకు, నోటికి చేతిని లేదా, కర్చీఫ్ తో అడ్డం పెట్టుకుంటారు. మరికొందరైతే.. తుమ్మితే ఏమనుకుంటారోనని తుమ్ము రాకుండా చూసుకుంటారు. కానీ ఇలా తుమ్మును కూడా ఆపడం చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా వేగంతో వచ్చే తుమ్ములను ఆపడం వల్ల శరీరంలోని ఇతర భాగాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందట.
ముఖ్యంగా గొంతు, ముక్కు, నోట్లోని కొన్ని కణాలపై ప్రతికూల ప్రభావం పడి కణాలు దెబ్బతినే ప్రభావం ఉంది. కొన్ని కొన్ని సార్లు మెదడుపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. అలాగే బలమైన వేగంతో వచ్చే తుమ్మును చెవివైపుకు మళ్లీస్తే మాత్రం చెవి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక తుమ్మును ఆపితే చెడు బ్యాక్టీరియా కూడా మన శరీరంలోనే ఉండిపోయి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..
ఆఫ్ఘానిస్థాన్లో బాంబు పేలుడు.. 50 మంది మృతి
- ప్రాణాలు తీసి నిరసనకారుల నోరు మూయలేరు..
- కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు నడిపాడు: గాయపడ్డ రైతు
- భారత్లో బ్లాక్ ఫంగస్ పంజాకు కారణమిదే..
- రైతులపైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర
- బొగ్గు సంక్షోభంతో కరెంట్ కష్టాలు..
- నిలిచిపోయిన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్..