Breaking
Tue. Nov 18th, 2025

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి

Jammu Kashmir encounter
Jammu Kashmir encounter

ద‌ర్వాజ‌-శ్రీనగర్‌
Jammu Kashmir encounter: జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలకు-ఉగ్రవాదులకు మధ్య చోటుచేసుకున్న‌ ఎదురుకాల్పుల్లో ఒక జూనియర్‌ కమిషన్డ్‌ అధికారితో పాటు మరో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూంచ్‌ జిల్లాలోని నియంత్రణా రేఖ వెంబడి ఉన్న సురాన్‌ కోట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముటాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఇక కాల్పులు జ‌రిగిన ప్ర‌దేశం నుంచి భారీ మొత్తంలో ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చైనా, పాక్‌ల‌కు చెందిన ఆయుధాలు సైతం ఉన్నాయి. ఇదిలావుండగా, బందీపొరాలోఁ హజిన్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం సైఁకఁలు ఓ ఉగ్రవాదిఁ మట్టుబెట్టారు. అతడు లష్కరే తొయిబాకఁ చెందిన ఇంతియాజ్‌ అహ్మద్‌ దార్‌గా గుర్తించారు. అలాగే, అనంత్‌నాగ్‌ జిల్లాలో మరో గుర్తు తెలియని ఉగ్రవాదిని హతమార్చారు.

లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయ‌న కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం

మండిపోతున్న పెట్రోల్ ధరలు

ఢిల్లీ గాలి పీల్చుకోనివ్వ‌ట్లేదు !

భారీ వర్షంతో మ‌ళ్లీ నీట‌మునిగిన హైదరాబాద్. వైర‌ల‌వుతోన్న వీడియోలు

ల‌ఖింపూర్‌ హింస: పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు

వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య

యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి

తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..

Related Post