దర్వాజ-న్యూఢిల్లీ
AIIMS doctor rapes colleague: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. నిత్యం ఏదోఒక చోట వారిపై హింస, అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ డాక్టర్ సహచర వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీ హౌస్ ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 26న ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఒక సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఇంటిలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సహచర వైద్యులతో కలిసి ఓ మహిళా డాక్టర్ హాజరయ్యారు. అయితే, రెసిడెంట్ డాక్టర్.. పార్టీ చివరిలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మహిళా వైద్యురాలికి ఇచ్చారు. అది తాగిన ఆమె స్పృహ తప్పి పడిపోయాక.. ఆమెపై లైంగికదాడి చేశాడు.
అయితే, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయపడిన సదరు బాధిత వైద్యురాలు… తాజాగా మిత్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడనీ, ఘటన జరిగిన తర్వాతి రోజు నుంచి కనిపించకుండా పోయాడనీ, విధులకు సైతం హాజరు కావడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్వాప్తు జరుపుతున్నారు.
కేరళను ముంచెత్తిన వరదలు.. 10 మంది మృతి
అంబరాన్నంటిన ‘బతుకమ్మ’ సంబురాలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తాం..
బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలికలు బలి
2-18 వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్