• నిరాశ్రయులైన వేలాది మంది..
• విరిగిన కొండచరియలు.. నేల కూలిన చెట్లు.. వరదల్లో కొట్టుకుపోయిన ఇండ్లు
దర్వాజ-తిరువనంతపురం
Kerala rain: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ కురుస్తుండటంతో వరదలు పొటెత్తాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. చెట్లు నేల కూలాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఇండ్లు వరదలో కొట్టుకుపోయియి. ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు పెర్కొన్నారు. వరదల నేపథ్యంలో శిథిలాల కింద అనేక మంది చిక్కున్నారనీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో రాష్ట్ర యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలకు చెందిన వివిధ బృందాలు సైతం పాల్గొంటున్నాయి. ఇప్పటికి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయియి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు అనేక చోట్ల నీట మునిగాయి. వరదల ప్రభావం అధికంగా ఉన్న ఇడుక్కి జిల్లాలో ఇప్పటి వరకు 11 మృతదేహాలు, కొట్టాయం జిల్లాలో మరో 14 మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
బొగ్గు కొరత.. కరెంట్ కోతలకు కారణాలేంటి? చార్జీలు పెరగనున్నాయా?
ఇప్పటికే వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. దాదాపు 100కు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందనీ, ఇప్పటివరకు ఎంతమంది తప్పిపోయారనేదానిపై స్పష్టత రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. భారీ వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ఇండ్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![landslides-1024x576 కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి](https://darvaaja.com/wp-content/uploads/2021/10/landslides-1024x576.jpg)
ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితులు దారుణంగా మారగా.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సోమవారం కూడా కేరళలో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తరభారతం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు రెండుమూడు రోజుల వరకు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కాగా, 2018 లో, కేరళలో సంభవించిన వరదల కారణంగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల టార్గెట్..
వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి చేసిన ఎయిమ్స్ డాక్టర్
కేరళను ముంచెత్తిన వరదలు.. 10 మంది మృతి
అంబరాన్నంటిన ‘బతుకమ్మ’ సంబురాలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తాం..