దర్వాజ-న్యూఢిల్లీ
Uttarakhand Rains: ఉత్తరాఖండ్‌పై ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఇప్పటికీ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీనికి తోడూ కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం కొనసాగింది. ఉత్తరాఖండ్‌లో ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 47కు పెరిగింది. రాష్ట్రంలోని కుమావోన్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. నైనిటాల్, రామ్‌నగర్, అల్మోరా, కాథ్‌గోడం, బద్రీనాథ్, కేధార్‌నాథ్ ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వందలాది ఇండ్లు వరదలో కొట్టుకుపోయాయి. రోడ్లు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో పలు చోట్లకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య అధికంగానే ఉందనీ, దీనిపై ఇంకా స్పస్టత రాలేదని ఆధికారులు పేర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు కేంద్ర విభాగాలకు చెందిన బృందాలు సైతం సహాయ చర్యలో పాలు పంచుకుంటున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ దళితబంధుకు ఈసీ బ్రేకులు
కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల టార్గెట్..
వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి చేసిన ఎయిమ్స్ డాక్టర్
కేరళను ముంచెత్తిన వరదలు.. 10 మంది మృతి