ప్ర‌శ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైర‌ల్

Viral Video
Viral Video

ద‌ర్వాజ‌-చంఢీగ‌డ్‌

mla slaps man who questions him on performance: ప్ర‌శ్నించినందుకు ఓ ఎమ్మెల్యే యువకుడిపై దాడి చేసిన ఘ‌ట‌న పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. పఠాన్‌కోట్ జిల్లాలోని భోవాలో దుర్గామాత మండపం వద్ద ఎమ్మెల్యే జోగిందర్ పాల్ గ్రామం గురించి మాట్లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ యువ‌కుడు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కానీ పాల్ పట్టించుకోక‌పోవ‌డ‌తో పోలీసులు ఆ యువ‌కుడిని పక్కకు తీసుకెళ్ల ప్రయత్నం చేశారు. అయితే ఆ యువ‌కుడు “మీరు నిజంగా ఏమి చేశారని?” ప్రశ్నించాడు. ఈ క్ర‌మంలోనే ఆ యువ‌కుడిని త‌న ముందుకు రావాల‌ని కోరిన ఎమ్మెల్యే జోగింద‌ర్ పాల్‌.. మైక్ యువ‌కుడికి ఇచ్చి అత‌నిపై దాడి చేశాడు. పోలీసులు సైతం ఆ యువ‌కుడిపై దాడి చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ప్ర‌శ్నిస్తే ప్ర‌జాప్ర‌తినిధులు దాడి చేయ‌డ‌మేంట‌ని స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది.

ఉత్త‌రాఖండ్‌పై ప్ర‌కృతి ప్ర‌కోపం.. 47కు పెరిగిన మృతులు

తెలంగాణ ద‌ళితబంధుకు ఈసీ బ్రేకులు

డేరా బాబాకు జీవిత ఖైదు

కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి

జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల టార్గెట్..

రైతుల రైల్ రోకో

వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగిక‌దాడి చేసిన ఎయిమ్స్ డాక్ట‌ర్

Related Post