Breaking
Tue. Nov 18th, 2025

4 గంటల్లోపు హుజూరాబాద్ ఫలితాలు

Huzurabad by polls
Huzurabad by polls

దర్వాజ-హైదరాబాద్

Huzurabad by polls : రాష్ట్రం మొత్తంగా ఎన్నికలు జరుగుతున్నంతగా తెలంగాణలో ఎన్నికల వేడిని రగిల్చింది హుజూరాబాద్ ఉప ఎన్నిక. అక్కడ బరిలో నిలిచి ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అదే తరహాలో నువ్వా నేనా అనే రీతిలో విమర్శలు, ఆరోపణలతో రెచ్చిపోయాయి. ఇదంతా ఒకెత్తు అయితే, ఈ ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆయా పార్టీలు ప్రయత్నాలు సాగించాయనేది బహిరంగ రహస్యమే. ఏకంగా తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు సైతం రోడ్డుపైకి చేరి ధర్నాలు కూడా చేశారు.

హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నిక సర్వత్రా ఆసక్తిని కలిగించింది. అక్టోబరు 30న పోలింగ్ నిర్వహించారు. ఫలితాలు మాత్రమే మిగిలాయి. గెలుపు మాదంటే మాదే అనే తరహాలో ఆయా పార్టీలు ఇప్పిటికే ప్రకటించేశాయి. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మంగళవారం (నవంబర్-2) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగనుంది. 14 టేబుళ్ల వద్ద ఓట్లు లెక్కించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముంది.

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ బరిలో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ బల్మూరి పోటీపడ్డారు.

పర్యావ‘రణం’.. డబ్ల్యూఎంవో ఆందోళన

Petrol Price: ఆగ‌ని పెట్రోవాత

COVID-19: కరోనా మరణాలు @ 50 లక్షలు

హ‌స‌రంగా హ్యాట్రిక్‌.. గెలుపు సౌతాఫ్రికాది !

నెల‌రోజుల‌కు పైగా ఉగ్ర‌రూపంలో లావా వెద‌జ‌ల్లుతున్న అగ్నిప‌ర్వ‌తం

Aryan Khan Drugs Case_ఆర్య‌న్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు

భ‌గ్గుమంటున్న చ‌మురు ధ‌రలు

పెగాస‌స్‌_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !

Related Post