Fire Accident: క‌రోనా ఆస్ప‌త్రిలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Maharashtra Covid Hospital Fire Accident
Maharashtra Covid Hospital Fire Accident

ద‌ర్వాజ‌-ముంబ‌యి
Maharashtra Covid Hospital Fire Accident: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మంటల ధాటికి బయటకు రాలేక చిక్కుకుపోయిన ఆరుగురు కరోనా పేషెంట్స్‌ సజీవదహనమయ్యారు.

దీనిపై అధికారులు మాట్లాడుతూ.. ప్రమాదం సమయంలో ఆ వార్డులో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. గాయ‌ప‌డిన మ‌రో ఏడుగురికి చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. బాధిత కుటుంబాల‌కు ప్ర‌ధాని మోడీతో పాటు రాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే సానుభూతి ప్ర‌క‌టించారు. దీనిపై ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్టు ఠాక్రే వెల్ల‌డించారు.

Climate Change: ప్ర‌కృతి విధ్వంసం.. ప్ర‌కోపం..

ప్ర‌పంచ నాయకుల న‌ట‌న !

Petrol Price: ఆగ‌ని పెట్రో మంట‌లు

మ‌హిళా హ‌క్కుల‌పై అవ‌గాహ‌న అవ‌స‌రం : జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

గౌరీ లంకేష్ హత్య కేసు.. 17 మందిపై అభియోగాలు

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రం..

COVID-19: కరోనా మరణాలు @ 50 లక్షలు

Related Post