• 100 మందికి పైగా తీవ్ర గాయాలు
• మృతులు మరింత పెరిగే అవకాశం: అధికార వర్గాల వెల్లడి
దర్వాజ-అంతర్జాతీయం
Fuel tanker blast in Sierra Leone : సియోర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక చమురు ట్యాంకర్ పేలిన ఘటనలో 92 మంది మరణించారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సియెర్రా లియోన్ ప్రభుత్వ వర్గాల వివరాల ప్రకారం.. ఫ్రీటౌన్ కు తూర్పున ఉన్న శివారు ప్రాంతమైన వెల్లింగ్టన్ లో ఓ చమురు ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలోనే లీకవుతున్న ఇంధనాన్ని సేకరించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
ఈ క్రమంలోనే పెలుగు సంభవించింది. దీంతో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు బతికే అవకాశం తక్కువేనని వైద్యులు పేర్కొన్నారు.
Fire Accident: కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
Climate Change: ప్రకృతి విధ్వంసం.. ప్రకోపం..
Petrol Price: ఆగని పెట్రో మంటలు
మహిళా హక్కులపై అవగాహన అవసరం : జస్టిస్ డీవై చంద్రచూడ్
గౌరీ లంకేష్ హత్య కేసు.. 17 మందిపై అభియోగాలు
పర్యావరణ పరిస్థితులు ఆందోళనకరం..
COVID-19: కరోనా మరణాలు @ 50 లక్షలు