దర్వాజ-హెల్త్ & బ్యూటీ
The Effects of Sleep Deprivation: మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత ముఖ్యమో.. కంటినిండా నిద్రకూడా అంతే ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే వచ్చే సమస్యలేన్నో. సరిపడా నిద్ర ఉంటేనే ఆ రోజంతా ప్రశాంతంగా ఎలాంటి తలనొప్పులు లేకుండా గడుస్తుంది. అదే నిద్ర లేకుంటే వచ్చే చికాకు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.
ఇక ఈ సంగతి పక్కన పెడితే.. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉంటే, తగినంత నిద్ర లేకపోయినా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర లేకపోతే ఖచ్చితంగా బరువు పెరుగుతారట. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు కూడా నిద్రలేమితో బాధపడితే వారికి ఇంకా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. అలాగే నిద్రలేమి సమస్య ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటుగా సెక్స్ కు సంబంధించి అనేక సమస్యలు కూడా వస్తాయని నిపుుణులు చెబుతున్నారు. అందుకే రోజుకు 6 నుంచి 8 గంటల సరైన నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న విడుదల
పోషకాహార లోపంలో 33 లక్షల మంది చిన్నారులు
సెలవు దక్కలేదనే కోపంతో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి
Chapped Lips Tips:చలికి పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..
Gold Price:మళ్లీ పెరిగిన బంగారం ధరలు
27 శాతం పెరిగిన వ్యాపారుల ఆత్మహత్యలు
తమిళనాడులో దంచి కొడుతున్న వానలు