Breaking
Tue. Nov 18th, 2025

Hindi: మాకు హిందీ తెలియదు.. సీఎస్‌ను మార్చండి !

Mizoram Chief Minister

• కేంద్ర మంత్రి అమిత్‌షాకు మిజోరం సీఎం లేఖ


ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
My ministers do not know Hindi: కేంద్ర ప్రభుత్వం నియమించిన మిజోరం కొత్త ప్రధాన కార్యదర్శి రేణుశర్మ నియామ‌కాన్ని పున:పరిశీలించాలని ఆ రాష్ట్ర సీఎం జొరాంథంగా.. కేంద్ర మంత్రి అమిత్‌షాకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు గమనిస్తే ఎన్డీయేలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయ అనే అనుమానం కలుగుతోంది. వివరాళ్లోకెళ్తే.. అమిత్‌షాకు రాసిన లేఖలో తన క్యాబినెట్‌లో పలువురు మంత్రులకు హిందీ తెలియదనీ, కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి మిజో తెలియ‌దు కాబ‌ట్టి సీఎస్‌ను మార్చాల‌ని సీఎం జొరాంథంగా పేర్కొన్నారు.

అయితే, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు, సీఎం జొరాంథంగా.. అమిత్‌షాకు ఈ లేఖ రాయడం సంచలనంగా మారింది. సీఎస్ నియామక పున:పరిశీలన గురించి పేర్కొంటూ మిజోరం మంత్రివ‌ర్గంలో చాలా మంది మంత్రులకు, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు హిందీ రాదు. అలాగే, ఇంగ్లీస్ కూడా స‌రిగ్గా అర్థం చేసుకోలేరు అనే కార‌ణాల‌ను చెప్పుకొచ్చారు. , రాష్ట్ర ప్రజలకఁ హిందీ రాదఁ, ఇంగ్లీష్‌ కూడా సరిగా అర్థం చేసుకోలేరఁ కారణాలను చెప్పుకొచ్చారు.

అలాగే, మిజో భాష తెలిసిన వారిని సీఎస్‌గా నియమించాల్సిందిగా కోరారు. ప్రస్తుత అదనపు ముఖ్య కార్యదర్శి జేసీ రామ్‌థంగాకు పదోన్నతి కల్పిస్తూ.. సీఎస్‌గా నియ‌మించాల‌ని కోరారు. దీనికి తోడూ తాను ఎన్డీయేలో నమ్మక భాగస్వామిగా ఉన్నాననీ, చాలా రాష్ట్రాల్లో అనేక పార్టీలు కూటములు మారాయంటూ పేర్కొనడం గమనార్హం.

వామ్మో.. టూత్ పేస్ట్ తో పిల్లలకు ఇంత డేంజరా?

Crime : క్షణికావేశం.. తీసింది భర్త ప్రాణం..

వామ్మో నిద్ర పోకపోతే ఇంత పెద్ద సమస్యా?

Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న విడుద‌ల

పోషకాహార లోపంలో 33 లక్షల మంది చిన్నారులు

సెలవు దక్కలేదనే కోపంతో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

Chapped Lips Tips:చలికి పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..

Related Post