Breaking
Tue. Nov 18th, 2025

IFFI Awards 2021: ఎక్కడా తగ్గేదే లే అంటున్న సంమంత..

samantha
samantha

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

IFFI Awards 2021: ఎక్కడా, ఎప్పుడూ తగ్గేదే లేదు అంటూ సమంత సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఈ మధ్యనే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ కొత్త ఉత్సాహంతో తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 పాపులర్ అయిన హీరోయిన్ గా సామ్ నిలిచిందని ఓ సర్వే ఈ మధ్యే తేల్చి చెప్పేసింది. దీనికి తోడు ఇన్ స్టాగ్రామ్ లో తనకు మించి తోపులెవరూ సౌత్ ఇండియాలో లేరని నిరూపించుకుంది.

ఇకపోతే సినీ రంగంలో కూడా ఈ అమ్మడు తన దూకుడును పెంచేసింది. ఇకపోతే వీటికి తోడు ఈ కుందనపు బొమ్మ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి సామ్ కు గౌరవంగా పిలుపొచ్చింది. ఇదిలా ఉంటే చైతూ తో విడాకుల తర్వాత సమంత కొన్ని రోజులు ఒంటరిగా గడిపింది. సోషల్ మీడియా నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది.

పాత జ్ఞాపకాలను మరిచిపోవడమే మేలని చైతూతో దిగిన ఫోటోలన్నింటిని సోషల్ మీడియా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం సమంత ఫుల్ బిజీ కాబోతోంది. శాకుంతలం సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న సామ్ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తోందట. వీటితో పాటుగా డ్రీమ్ వారియర్స్ నిర్మాణంలో కూడా మరో సినిమాను ఓకే చేసిందట సమంత. ఏదేమైనా అక్కినేని మాజీ కోడలు విడాకుల తర్వాత కూడా సినీ రంగంలో తనకంటూ ఉన్న గుర్తుంపును చెరగనివ్వడం లేదు.

Tamil Nadu Rain: త‌మిళ‌నాడు భారీ వ‌ర్షాల‌తో 12 మంది మృతి

RRR: రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ ‘నాటు’ డ్యాన్స్‌ అదిరింది!

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికో గుడ్ న్యూస్..

Hindi: మాకు హిందీ తెలియదు.. సీఎస్‌ను మార్చండి !

వామ్మో.. టూత్ పేస్ట్ తో పిల్లలకు ఇంత డేంజరా?

Crime : క్షణికావేశం.. తీసింది భర్త ప్రాణం..

వామ్మో నిద్ర పోకపోతే ఇంత పెద్ద సమస్యా?

Related Post