దర్వాజ-భోపాల్
Crime against women: సంతానం కోసం ఏకంగా ఓ యువతిని 16 నెలలుగా బంధించి ఆమెపై లైంఘిక దాడికి పాల్పడ్డ అమానుష ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరిగింది. ఈ దారుణంలో నిందితుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. ఇకపోతే శిశువు పుట్టిన వెంటనే ఈ నెల 6 న బాధిత యువతిని బస్టాప్ లో పడేసి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ పాల్ సింగ్(38), చంద్రకాంత(26) దంపతులు ఉజ్జయినిలోని కథ్ బరోడా గ్రామంలో నివసిస్తుంటారు.
కాగా వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దాంతో ఆ జంటకు ఎలాగైనా సంతానం కావాలనే ఆశతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో నుంచి ఓ మహిళ నుంచి 16 నెలల క్రితం యువతిని(21) కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ యువతిని తన ఇంట్లోనే బందీని చేసి ఆమెపై రాజ్ పాల్ తరచుగా లైంఘిక దాడి చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి గర్భవతి అయ్యింది. అక్టోబర్ 25 న ఆ యువతి ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
దాంతో రాజ్ పాల్ ఆమె అవసరం ఇక లేదంటూ అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఈ నెల 6 న దేవాస్ బస్టాప్ లో పడేసి అక్కడి నుంచి చెక్కేసాడు. పూర్తిగా ఆ యువతి స్పృహలోకి వచ్చాక జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు రాజ్ పాల్ దంపతులతో పాటుగా మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇందులో ప్రధాన నిందితుడైన రాజ్ పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెళ్లడించారు.
Air Pollution: కాలుష్యం.. ప్రపంచంలోనే టాప్లో ఢిల్లీ
Tulsi Gowda: అడవి తల్లి బిడ్డకు దక్కిన ‘పద్మం’.. ఆమె కథేంటీ?
పిల్లల్ని కనడంపై ఉపాసన సమాధానం ఇదే..
Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్
3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ
బాబోయ్ బాలయ్య ఏంటా ఎనర్జీ.. అన్ స్టాబబుల్ స్టేజిపై బాలయ్య అదిరిపోయే స్టెప్పులు
Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్
Assam Road Accident : త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి