దర్వాజ-హెల్త్ & బ్యూటీ
drink more water in winter: చలికాలం వచ్చేసింది.. ఇప్పటికే చాలా నగరాల్లో చలి తీవ్ర స్థాయిలో ఉంది. అందుకే భారెడు పొద్దు పోయినా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. అయితే ఈ కాలంలో చెమట ఎక్కువగా పట్టక పోవడంతో చాలా మంది నీటిని తాగడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే నీళ్లు తాగితే ఇంకా చలిపెడుతదని అనుకుంటున్నారు.
కానీ ఇలా నీటిని ఇగ్నోర్ చేస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాహంగా అనిపించకపోయినా నీటిని తాగుతూ ఉంటేనే బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
1. చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగడంతో బాడీ శీతాకాలపు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ముఖ్యంగా నీరే మన బాడీలోని ఆక్సిజన్ మొత్తాన్ని నిర్వహిస్తూ ఉంటుంది.. కాబట్టి దాహంగా అనిపించకపోయినా తరచుగా నీళ్లను తాగుతూ బాడీని హైడ్రేట్ గా ఉంచాలి.
2. అలాగే ఈ కాలంలో కూడా నీళ్లను అధికంగా తాగడం వల్ల మీ చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా అనేక రకాల చర్మ సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.
3. నీటిని మీరు ఎంత ఎక్కువగా తాగితే మీ శరీరం అంత శక్తిని పుంజుకుంటుంది. మీ శరీరానికి అవసరమైనప్పుడే ఈ శక్తి వినియోగించబడుతుంది.
4. ఇకపోతే అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి నీళ్లు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ నీళ్లే తిన్న ఆహారాన్ని సులభంగా అరిగించడానికి సహాయకారిగా ఉంటుంది. అందుకే చలికాలమైనా సరే నీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంతమంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
5. ముఖ్యంగా నీరే మీలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో నీళ్లే కదా అని నెగ్లెట్ చేసి తాగకుండా ఉండకండి.
T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా
బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..
పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ నేరాలు
‘కాప్26లో పాల్గొనకపోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణం’
ఆవు పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Samantha : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో సమంత చిందులు !
2 లక్షల జీతం కానీ.. 30 వేలకు కక్కుర్తిపడి.. చివరకు..?
Madras High Cour: ప్రజా ప్రయోజనం కోసమా? మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?