దర్వాజ-హెల్త్ & బ్యూటీ
health tips : నేడు చాలా మంది ఊబకాయంతో.. అధిక బరువుతో బాధపడుతున్నారనేది అక్షర సత్యం. బరువు కోల్పోడానికి ఎలాంటి డైట్ పాటించాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియక నేడు చాలా మంది బరువు సమస్యతో సతమతమవుతున్నారు. అందరిలాగే తాము సన్నగా, ఫిట్ గా కనిపించాలని ఉంటుంది. దానికోసమే ఎన్నో ప్రయత్నాలను కూడా చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు విఫలం అవ్వడంతో నిద్రలేమి సమస్య భారిన కూడా పడుతున్నారు.
కానీ నిద్ర కూడా మీ బరువును తగ్గిస్తుందన్న సంగతి ఎవరికైనా తెలుసా.. నిజమండీ.. కంటినిండా నిద్ర గనక ఉంటే మీ బరువును ఈజీగా కోల్పోవచ్చు. అందుకు మీరు చేయాల్సినవి రోజుకు 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. అలాగని అర్థరాత్రి వరకు మేల్కొని అప్పుడు కూడా ఏదో ఒకటి తిని అస్సలు పడుకోవద్దు. నైట్ టైం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. దీనివల్ల తక్కువ కేలరీలు అంది బరువు పెరగకుండా ఉంటారు.
అంతకు మించి నిద్ర కూడా తొందరగా పడుతుంది. ఒకవేల మీరు సరిగ్గా నిద్రపోకుండా ఉంటే శరీరంలో హార్మోన్లకు భంగం కలిగి బ్లడ్ లో చక్కెర పెరుగుతుంది. దీంతో అటోమెటిక్ గా బరువు పెరుగుతారు. అంతకు మించి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే నిద్ర పోతే బరువు తగ్గుతారనే దానికి శాస్త్రీయ కారణం కూడా ఉందండోయ్. మనం నిద్రిస్తున్నప్పుడు మనం తీసుకునే శ్వాస, చెమటలు పట్టడం వల్ల కూడా బరువు తగ్గుతారు. సో నిద్ర లేకపోతే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. దీనితో పాటుగా వాకింగ్, వ్యాయామాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
E-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్
తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..
చలికాలమని నీళ్లు తాగకుండా ఉంటున్నారా?.. అయితే మీ పని అంతే..
T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా
బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..
పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ నేరాలు
‘కాప్26లో పాల్గొనకపోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణం’