దర్వాజ-సినిమా
shrutihaasan: ‘క్రాక్’ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది శృతిహాసన్.. టాలీవుడ్ లో ఈ చిన్నదాని జోరు తగ్గిందన్న టైం లోనే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడి జోరు ఓ రేంజ్ లో దూసుకెళుతోంది. ఇంకేముంది కుర్రహీరోలతో పాటుగా సీనియర్ స్టార్స్ సరసన కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ శృతిహాసన్. క్రాక్ సినిమా తర్వాత ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘వకీల్ సాబ్’ నటించి ప్రేక్షకులను మెప్పించింది.
అలాగే పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో ప్రభాస్ సరసన నటిస్తోందన్న సంగతి తెలిసిందే. దీనితో పాటుగా నందమూరి నటసింహం బాలయ్య బాబు సరసన నటించడానికి కూడా ఈ అమ్మడు ఓకే చెప్పిందట. బాలయ్య బాబు, గోపిచంద్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఫిక్స్ అయ్యిందట. కుర్ర హీరోల సరసన మెరిసే ఈ అమ్మడు బాలయ్య సరసన నటిస్తోందంటే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే దీనికి ఒక కారణం కూడా ఉందండోయ్. ఈ సినిమాలో నటించడానికి శృతిహాసన్ కొన్ని షరతులు కూడా పెట్టేసిందట. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా లేకుంటేనే చేస్తానని కండీషన్ పెట్టేసిందట. దానికి డైరెక్టర్ ఓకే అనడంతో ఈ అమ్మడు ఇందులో నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది మరికొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’
AP Floods: 12 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు
AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు
PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ
బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం
EY-Refyne Survey : నెల కాకముందే జీతం ఖతం..
Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?
Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..