Breaking
Tue. Nov 18th, 2025

చలికాలంలో కూడా ఈ సబ్బులను వాడుతున్నారా? అయితే మీకు ఆ సమస్య వచ్చినట్టే..

Soap
Soap

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Skin care and soape: మారుతున్న వాతావరణ పరిస్థితులకనుగుణంగా మన చర్మం కూడా స్పందిస్తుంటుంది. ముఖ్యంగా ఈ చలికాల ప్రభావం మన చర్మంపై తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా అనేక చర్మ సమస్యలకు లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువే. అందుకే ఆరోగ్యం, అందం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో చర్మ సంరక్షణ ఎంతో అవసరం.

అందుకే మనం వాడే సబ్బుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకమైన సబ్బులనే వాడమని సలహాలు, సూచనలిస్తున్నారు. చర్మం, పొడిబారకుండా, బిగుసుపోకుండా, తెల్లగా పేలవంగా మారకుండా ఉండాలంటే మాత్రం గ్లిజరిన్ ఎక్కువ శాతం ఉండే సోప్ లనే వాడాలి.

ఈ సోప్ ల వాడకం వల్ల చర్మాన్ని కొంతమేరకైనా సంరక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సబ్బుల వాడకం కూడా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే చలికాలంలో వాడే మాయిశ్చరైజర్ క్రీములను వాడటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే చర్మానికి తేమ అంది నిగనిగలాడుతుంది.

స్టైలిష్ వేర్ లో నోరెళ్ల బెట్టిస్తున్న సమంత.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..

మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Related Post