Breaking
Sat. Jun 28th, 2025

healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ

healthcare for the urban poor
healthcare for the urban poor

• వైద్య సంరక్షణ అవసరాలు తీర్చడంలో మున్సిప‌ల్ బాడీలు విఫ‌లం
• పేద‌ల‌కు అంద‌ని వైద్య సంర‌క్ష‌ణ సౌక‌ర్యాలు
• అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడి

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

healthcare for the urban poor: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశ ఆరోగ్య వ్యవస్థలో నెలకొన్న డొల్లతనం బయటపడింది. కరోనా ప్రారంభంలో పెద్ద ఎత్తున ఆరోగ్య వ్యవస్థలో మార్పులు శ్రీకారం చుడుతున్నామని కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం ప్ర‌క‌టించాయి. అయితే, ఎడాదిన్నర దాటుతున్న ఆరోగ్య వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకురావడం, వైద్య రంగాన్ని మెరుగుపర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇటీవ‌లే ప‌లు నివేదిక‌లు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని పట్టణ పేదల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడంలో మున్సిపల్‌ బాడీలు విఫలమవుతున్నాయని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంది.

మున్సిపాలిటీల్లో సరిపడా, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు లేని కారణంగా పట్టణ పేదలు ప్రయివేటు రంగంలో సేవలు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. పట్టణీకరణ అత్యంత వేగంగా విస్తరిస్తున్నందున, 1960లో 18 శాతంగా ఉన్న పట్టణ జనాభా 2019 నాటికి రెట్టింపు (34 శాతం) అయిందని పేర్కొంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పట్టణ పేదలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు పొందకుండా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పేదలకు ఆరోగ్య సంరక్షణలో తగినంత బడ్జెట్‌ను కేటాయించడం లేదు. ఈ విషయంలో మున్సిప‌ల్, అక్కడి పరిపాలన సంస్థలు విఫలమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రాంతీయ ఎన్జీవోల సహకారంతో అధ్యయనం సాగించి అజీమ్‌ ప్రేమ్‌జీ వర్సీటీ ఈ నివేదికను ‘హెల్త్‌ కేర్‌ ఈక్విటీ ఇన్‌ అర్బన్‌ ఇండియా’ అనే పేరుతో విడుదల చేసింది. దేశంలోని నగరాల్లో ఆరోగ్య దుర్బలత్వం, అసమానతలను ఎత్తిచూపింది. పట్టణ ప్రాంతాల్లో జీవన పరిస్థితుల్లో వ్యత్యాసాలు అధికంగా ఉంటాయి. దీనికి సమాజికంగా ఉన్న అంతరాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లో 10 రెట్లు వ్యత్యాసం ఉన్నప్పటికీ, పట్టణ పేదలు ప్ర‌యివేటు సంరక్షణను ఎక్కువ‌గా ఎంచుకుంటున్నారు. ప్ర‌భుత్వ సౌకర్యాల కొరతే దీనికి కారణమని నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: కేంద్రంతో కొట్లాటే.. సీఎం కేసీఆర్

‘‘పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పట్టణ ప్రజారోగ్య సేవల లభ్యత దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనల కంటే 40శాతం తక్కువ‌గా ఉంది. అదనంగా, అందుబాటులో ఉండాల్సిన సౌకర్యాలు సైతం చాలా తక్కువ‌గా ఉన్నాయి. దీని కారణంగా పట్టణ పేదలు..ముఖ్యంగా పట్టణాల అంచున..మురికివాడల్లోని ప్రజలు అత్యంత హానికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు’’ అని అధ్యయనం పేర్కొంది. ఉదాహరణకు దేశంలోని పేదల్లో 30 శాతం మంది ప్రయివేటు మూలాల నుంచి డెలివరీ కేర్‌ను కోరుకుంటున్నారు. ఫలితంగా అధిక ఖర్చులకు దారితీస్తుంది. అయితే, సేవలకు ప్రాప్యత, అధిక ఖర్చులు ఇటువంటి అసమానతలు ఆరోగ్య సేవలను ఆలస్యం చేయడం లేదా పూర్తిగా వదులుకోవడానికి కారణమవుతున్నాయి. ప్రత్యేకించి దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే పరిస్థితులను దిగజారుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

పేదల అసమాన వైద్య భారాన్ని సైతం అధ్యయనం ఎత్తి చూపింది. పట్టణ ప్రాంతాల్లోని ధనవంతులతో పోలిస్తే పేదవారిలో ఆయుర్దాయం పురుషులు, స్త్రీలలో వరుసగా 9.1, 6.3 సంవత్సరాలు తక్కువ‌గా ఉంది. ‘‘కొన్ని ఆరోగ్య పరిస్థితుల పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ పేదలతో పోల్చినప్పుడు కూడా పట్టణ పేదలలో వైద్య ఖర్చుల భారం ఎక్కువ‌గా ఉంది. ‘‘పిల్లలలో తక్కువ బరువు, ఊబకాయం, క్షయ వంటివి ప్రభావితం చేస్తున్నాయి. పట్టణ ధనవంతులు, గ్రామీణ పేదలతో పోలిస్తే పట్టణ పేదలలో మద్యం, ఖైనీ, ధూమపానం వంటి ప్రమాద కారకాలకు గురికావడం చాలా ఎక్కువ, పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అట్టడుగు సామాజిక-ఆర్థిక సమూహాలు, మహిళల్లో మానసిక అనారోగ్యం ఎక్కువ‌గా ఉంది’’ అని నివేదిక కనుగొంది. ప్రభుత్వ వైద్య సౌకర్యాలు అందించే వ్యవస్థల్లో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది కొరత అధికంగా ఉంద‌ని అధ్యయనం గుర్తించింది. 

మరిన్ని కథనాలు:

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తేవాల్సిందే..

Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?

CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం

Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

AP Floods: 12 మంది మృతి.. ప‌దుల సంఖ్య‌లో గ‌ల్లంతు

AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు

PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ

బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం

Related Post