Loading Now
Labourer's hand chopped off in MP's Rewa

కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని

• మధ్యప్రదేశ్‌లో ఘటన.. ముగ్గురి అరెస్టు

ద‌ర్వాజ‌-భోపాల్‌
Labourer’s hand chopped off in MP’s Rewa: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెండింగ్‌లో ఉన్న‌ కూలీ డబ్బులు ఇవ్వాలని అడిగిన ఓ కార్మికఁడి చేయిని నరికాడు ఓ యజమాని . ఈ ఘటన రేవా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో నిర్మౌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డోల్మౌ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షెడ్యూల్డ్ కులానికి చెందిన బాధిత కార్మికుడు అశోక్‌ సాకేత్‌ ఇంతకు ముందు డోల్మౌ గ్రామంలో గణేష్‌ మిశ్రా వద్ద నిర్మాణ పనుల్లో కార్మికఁడిగా పనిచేశాడు. అతనికి అందాల్సిన పెండింగ్ వేతనాలను చాలా రోజుల నుంచి ఇవ్వడం లేదు.

ఈ క్రమంలోనే పెండింగ్ వేతనాల విషయమై శ‌నివారం నాడు సాకేత్‌.. మిశ్రాను కలిశాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యజమాని కార్మికుడు సాకేత్‌పై పదునైన ఆయుధంతో దాడిచేసి.. అతని చేయి నరికేశాడు. నిందితుడు తెగిపడిన చేతిని దాచడానికి ప్రయత్నించాడని అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎఎస్‌పీ) శివకుమార్‌ వర్మ తెలిపారు. బాధిత కార్మికుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

వైద్యుల బృందం శస్త్రచికిత్స తర్వాత తెగిన చేతిని తిరిగి జతచేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉంద‌ని వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి యజమానితో పాటు మరో ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి.. అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Bigg Boss: బిగ్ బాస్ లీక్.. ఇంటి నుంచి ఈ వారం ఔట్ అయ్యేది..?

Gold: బంగారం కొనే వారికో గుడ్ న్యూస్..

ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..

Papagni River: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్

Healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తేవాల్సిందే..

Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?

Share this content:

You May Have Missed