దర్వాజ-హెల్త్&బ్యూటీ
Roasted Chana:కొవ్వు శాతం తక్కువ ఉండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ఈ శనగల్లో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా శనగలను తినాలని సలహాలిస్తుంటారు. వీటిని పచ్చిగా తిన్నా.. కాల్చి తిన్నా.. ఎన్నో ప్రయోజనాలుంటారు. ముఖ్యంగా ఈ శనగలను రోజూ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కాల్చిన శనగల్లో తక్కువ కాలరీలు ఉండటంతో వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు.
దీంతో పాటుగా పీచు ఎక్కువగా ఉండే ఈ శనగల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా కాల్చిన శనగల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో వీటిని తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే గుండె సంభందిత రోగాలకు చక్కటి నివారణలా కూడా శనగలు ఉపయోగపడతాయి. దాంతో పాటుగా మధుమేహ సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది.
అలాగే రక్తంలో చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఎముకలు బలంగా మారడంతో పాటుగా జీర్ణ వ్యవస్థను కూడా బలపరుస్తాయి ఈ కాల్చిన శనగలు. ఒక వేళ మీకు అజీర్థి, గ్యాస్ వంటి సమస్యలుంటే వీటి తినడం వల్ల ఉపశమనం పొందుతారు. బలహీనంగా ఉన్నవారికి గ్లాసు పాలల్లో కాల్చిన శనగపిండిని కలిపి తాగిస్తే బలహీనత నుంచి బయటపడొచ్చు. ఇకపోతే అలసట, నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తాయి. రక్తహీనత సమస్య ఉంటే ఈ కాల్చిన శనగలను బెల్లంతో తింటే సరి.