Breaking
Tue. Nov 18th, 2025

పీరియడ్స్ టైం లో తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!

period pain
period pain

దర్వాజ-హెల్త్&బ్యూటీ

periods: నెలసరిలో వచ్చే నొప్పి సర్వసాధారణమైనదే. కానీ ఆ సమయంలో వచ్చే.. కడుపు నొప్పి, చిరాకు, తలనొప్పి నుంచి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మనం తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆ టైం లో వచ్చే కడుపు నొప్పి, మలబద్దకం, తిమ్మిర్లు, తలనొప్పి, మానసిక కల్లోలం, పాదాల నొప్పులు తెగ చికాకు పెట్టిస్తుంటాయి. ఈ చికాకుల నుంచి బయటపడాలంటే మాత్రం మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. ఈ ఆహారాన్ని తినడం వల్ల ఆ నొప్పి, చికాకుల నుంచి కాస్త రిలాక్స్ గా ఫీలవ్వొచ్చు.

రోజూ కంటే పీరియడ్స్ టైం లో నీళ్లు ఎక్కువగా తాగాలి. అలా తాగడం వల్ల తలనొప్పి, టెన్షన్ తగ్గుతాయి. అలాగే మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్ లు పుష్కలంగా ఉండే అరటి పండును కూడా తినాలి. ఇది తినడం వల్ల కడుపు నొప్పి తగ్గడంతో పాటుగా అతిసార సమస్య కూడా రాదు. అలాగే అల్లంతో చేసిన కషాయాన్ని తాగడంతో కడుపు నొప్పి, మోకాలి నొప్పి సమస్య తగ్గుతుంది. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉన్న నారింజ పండు కూడా పీరియడ్స్ లో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే చేపను తినడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. తక్కువ సమయంలో అధిక శక్తిని ఇవ్వడంలో ఈ ఫుడ్ ఉపయోగపడుతుంది. నెలసరి టైం లో ఎదురయ్యే బలహీనత సమస్యకు కోడి గుడ్డు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఐరన్, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు బలహీనతను తగ్గిస్తుంది. వీటితో పాటుగా డార్క్ చాక్లెట్ మంచి మూడ్ బూస్టర్ లా పనిచేస్తుంది. సో డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీరు ఆ టైం లో మరింత సౌకర్యవంతంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని కథనాలు :

Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన అదానీ

Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..

Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’

రైల్వే ట్రాక్ ప‌క్క‌నే వీడియో కోసం.. కానీ అంత‌లోనే..

తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..

కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని

Related Post